Site icon Prime9

Vijay Mallya: కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు రేపు శిక్ష ఖరారు

New Delhi: కోర్టు ధిక్కరణ కేసులో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు రేపు శిక్ష ఖరారు చేయనుంది. 2017లో విజయ్ మాల్యా కోర్టు ఆదేశాలను దిక్కిరించారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా 40 మిలియన్ డాలర్లను తన పిల్లల పేరున బదిలీ చేశారు. అయితే ఈ కేసులో తమ ఎదుట హాజరు కావాలని పలుమార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు.

ఈ ఏడాది ఫిబ్రవరి 10న మాల్యాకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. ఇక ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియడంతో మార్చి 10న తీర్పును రిజర్వులో పెట్టారు. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం రేపు తీర్పును వెలువరించనుంది.

Exit mobile version