Site icon Prime9

Vodafone Idea: సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన వొడాఫోన్‌ ఐడియా

Vodafone Idea

Vodafone Idea

Vodafone Idea: తమ కస్టమర్ల కోసం ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ. 549 లతో 180 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ను కస్టమర్ల కోసం ప్రారంభించింది. అంటే ఒకసారి రీఛార్జ్‌ చేస్తే దాదాపు ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు. డేటా అవసరం లేకుండా కేవలం పరిమిత కాల్స్‌ మాత్రమే ఉపయోగించే వారికి ఈ ప్లాన్‌ బాగా ఉపయోగపడనుంది.

 

ఈ ప్రీపెయిడ్ ఆఫర్ వివరాలివే..(Vodafone Idea)

అయితే, ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు రీఛార్జ్‌ ప్లాన్స్ లో డేటాతో పాటు కాల్స్‌ను కూడా అందిస్తున్నాయి. కానీ , వొడాఫోన్ ఐడియా మాత్రం అందుకు భిన్నంగా ఈ సరికొత్త ప్లాన్‌ను డిజైన్‌ చేసింది. రూ. 549 తో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే రూ. 549 టాక్‌టైమ్‌ లభిస్తుంది. 6 నెలల పాటు వ్యాలిడిటీ అందిస్తోంది. అది కూడా లోకల్‌/ ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి రూ. 2.5 చొప్పున ఛార్జ్‌ చేస్తారు. ఈ ఆఫర్ కింద కేవలం 1 జీబీ డేటా వస్తుంది.

ఒకవేళ ఆ డేటా అయిపోతే డేటా వోచర్స్ తో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. అపరిమిత కాల్స్‌, మెసేజ్ ల సదుపాయం లేదు. సెకండరీ సిమ్‌గా వొడాఫోన్‌ ఐడియా వాడేవారికి ఈ ప్లాన్‌ యూజ్ అవుతుంది. సెకండ్‌ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకున్నపుడు ఎక్కువ మొత్తం పెట్టాల్సి వస్తోంది. దీంతో చాలా మంది రెండో సిమ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్‌ ఐడియా ఈ లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది.

 

Exit mobile version