Vivo X90: వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో సరికొత్త ఫీచర్లతో మరో ఫోన్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. వివో ఎక్స్ 90(vivox90) పేరుతో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేయబోతోంది. ఏప్రిల్ చివర్లో ఈ ఫోన్ భారత మార్కెట్ లోకి వస్తుందని… వివో ఎక్స్ 90 సిరీస్ లో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో లు రానున్నట్టు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ సిరీస్ లు గత నవంబర్ లోనే చైనా మార్కెట్ లో అడుగు పెట్టాయి. ప్రస్తుతం భారత మార్కెటలో రిలీజ్ ఫోన్ ల ఫీచర్లు , స్పెసిఫికేషన్స్ ను కంపెనీ పేర్కొనలేదు. కానీ ఆ వివరాలన్నీ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
త్వరలో రాబోయే వివో ఎక్స్90 సిరీస్ ఫోన్ ధరలు, ఫీచర్స్ ను పరిశీలిస్తే.. సిరకొత్త ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో ఈ డివైజ్ లు వస్తున్నాయి. 6.78 ఇంచుల హెచ్ డీ స్క్రీన్, 120 HZ, 50 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్, 50 MM IMX758 సెన్సార్, 12 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగా పిక్సల్ సెల్ఫీ సెన్సార్, 12 మెగా పిక్సల్ పోట్రైట్ కెమెరా కూడా ఉంటుంది.
అదే విధంగా వివో ఎక్స్ 90 ప్రో లో 6.78 ఇంచుల సైజు, 2k రిజల్యూషన్ తో పని చేస్తుంది. 4,870 mah బ్యాటరీ , 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 50 w ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.
వివో ఎక్స్ 90, వివో ఎక్స్90 ప్రో ఫోన్ల ధరలు రూ. 60 వేల నుంచి రూ. 80 వేల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. వివో x80 సిరీస్ పాత ఫ్లాగ్ షిప్ స్నాప్ డ్రాగన్ చిప్ ను అందిస్తోంది. ఇండియన్ మోడల్స్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ని కూడా అందించనుంది.