Toyota Innova Crysta: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా తన ‘2023 ఇన్నోవా క్రిస్టా’ దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ డిజైన్ లో సరికొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఇన్నోవా
క్రిస్టా ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి వస్తుందని అంతా అనుకున్నా.. అది జరగలేదు. కాగా కొత్తగా రిలీస్ అయిన ఇన్నోవా క్రిస్టా ధరలు, వేరియంట్స్ లాంటి మరిన్ని వివరాలు చూడవచ్చు.
2023 టయోటా ఇన్నోవా క్రిస్టా G, GX, VX , ZX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 19.13 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధరలు రూ. 20.09 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).
ఈ కొత్త కారుని కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్న ఇన్నోవా హైక్రాస్‌తో పాటు విక్రయించనున్నట్లు సమాచారం.
డిజైన్ విషయంలో ఇన్నోవా క్రిస్టా దాదాపు పాత మోడల్ మాదిరిగా ఉన్నా.. కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు.
ఇందులో ఫ్రంట్ గ్రిల్, రీ డిజైన్ చేసిన బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ లాంటివి ఉన్నాయి. కానీ సైడ్ ప్రొఫైల్, రియర్ ఫ్రొఫైల్ మాత్రం అప్టేట్ అవ్వలేదు.
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 ఇన్నోవా క్రిస్టా 7-సీటర్, 8-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.
ఇందులో పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్ మెంట్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రెండో వరుసలో వన్ టచ్ టంబుల్ లాంటి ఫీచర్లు ఇచ్చారు.
అంతే కాకుండా ఇందులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.
గతంలో టయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టాలోని 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ నిలిపివేసింది.
దానికి ముందు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది.
అయితే ఇప్పుడు విడుదలైన లేటెస్ట్ ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
2023 ఇన్నోవా క్రిస్టాలో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ మొదలైనవి ఉన్నాయి.
ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.