Airtel: భారతదేశంలో ఓటీటీలకు ఆదరణ రోజురోజుకి పెరుగుతుంది. దీంతో యూజర్లకు అనుగుణంగా.. టెలికాం సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓటీటీలో ఎక్కువ ఆదరణ కలిగిన దాంట్లో డిస్నీ +హాట్ స్టార్ ఒకటి. ఎయిర్‌టెల్ ఈ ఓటీటీని అందిస్తూ పలు ప్లాన్లను రూపొందించింది. ఓసావి అవెంటో చూద్దాం.
మూడు నెలల కాల వ్యవధి.. (Airtel)
భారతదేశంలో ఓటీటీలకు ఆదరణ రోజురోజుకి పెరుగుతుంది. దీంతో యూజర్లకు అనుగుణంగా.. టెలికాం సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓటీటీలో ఎక్కువ ఆదరణ కలిగిన దాంట్లో డిస్నీ +హాట్ స్టార్ ఒకటి. ఎయిర్‌టెల్ ఈ ఓటీటీని అందిస్తూ పలు ప్లాన్లను రూపొందించింది. ఓసావి అవెంటో చూద్దాం.
ఎయిర్‌టెల్ మూడు నెలల వ్యాలిడిటీతో డిస్నీ +హాట్ స్టార్ ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ కు మంచి ఆదరణ ఉంది. దీంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రూ.839 అపరిమిత ప్లాన్..
ఎయిర్‌టెల్ అందించే ఆఫర్లలో ముఖ్యమైంది రూ. 839. దీని ద్వారా యూజర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
ప్రతి రోజు.. 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. మరోవైపు ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో అపరిమిత 5జీని కూడా ఎంజాయ్ చేయొచ్చు.
ఈ ప్రయోజనాలతో పాటు రూ.839 ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలల వరకు పొందొచ్చు.
అలాగే 84 రోజుల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లోని ఏదో ఒక ఛానెల్‌ను వీక్షించొచ్చు.
సోనీలివ్, లయన్స్‌గేట్‌ప్లే, ఈరోస్‌నౌ, హోయ్‌చొయ్, మనోరమామ్యాక్స్, చౌపల్, కచ్చాలంకా వంటి ప్రముఖ ఛానెళ్ల జాబితా నుంచి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్..
ఈ రూ.499 ప్లాన్‌లోనూ అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ వస్తాయి. రోజుకి 3జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి.
3జీబీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు పరిమితమవుతుంది. 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో 5జీ డేటాను పరిమితి లేకుండా వినియోగించుకోవచ్చు.
ఈ ప్రయోజనాల కాలపరిమితి 28 రోజులు.
ఈ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ ను మూడు నెలల పాటు పొందొచ్చు. మరోవైపు 28 రోజుల పాటు ఎంపిక చేసుకున్న ఏదో ఒక ఎక్స్‌ట్రీమ్ ఛానెల్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
రివార్డ్స్‌మినీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అపోలో 24×7 సర్కిల్ సభ్యత్వం మూడు నెలల పాటు వస్తుంది.
ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ అందుతుంది. ఉచిత హలోట్యూన్స్ లభిస్తాయి. వింక్ మ్యూజిక్‌ను కూడా పొందొచ్చు.