Skoda Kodiaq: దేశంలో కొత్త బీఎస్6 ఫేస్-2 నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. దీంతో వాహన తయారీ సంస్థలన్నీ తప్పకుండా బీఎస్6 నియమాలను పాటించాలి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలతో స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లోకి కొత్త కారును విడుదల చేసింది. ఈ లేటెస్ట్ కారు ధర, డిజైన్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి.
కొత్త నిబంధనల ప్రకారం విడుదలైన స్కోడా కారు ‘ కొడియాక్ ‘ 7 సీటర్ ఎస్ యూవీ. ఈ SUV ధర రూ. 37. 99 లక్షలుగా నిర్ణయించింది. అదే విధంగా స్పోర్ట్స్ లైన్ వేరియంట్ ధర రూ. 39. 39 లక్షలుగా ఉంది. ఈ మోడల్ ధర.. దాని మునిపటి మోడల్ కంటే ఎక్కవ కావడం గమనార్హం. ఈ ఎస్ యూవీ కోసం కంపెనీ బుకింగ్స్ మొదలు పెట్టిన 24 గంటల్లో 1200 యూనిట్లు బుక్ అవ్వడం విశేషం. అయితే కంపెనీ ఈ కొత్త కారుని భారత్ లో కేవలం 3000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.
అయితే డెలివరీల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 2023 స్కోడా కొడియాక్ మోడల్ చూడటానికి మునుపటి మోడల్ లానే అనిపిస్తుంది. కానీ, ఇందులో కొన్ని మార్పులు కూడా చేసింది. ఈ ఎస్ యూవీలో రియర్ స్పాయిలర్ ఏరో డైనమిక్ పర్ఫామెన్స్ అనుమతించే రీవర్డ్స్ వెంట్స్ కలిగి ఉంది. అంతే కాకుండా ఆటో మాటిక్ డోర్ ఎడ్జ్ ప్రొటక్షన్ కూడా ఈ మోడల్ ఉంటుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. 8.0 ఇంచుల టచ్ స్క్రీన్ కలిగి ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే లాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్ బిల్ట్ నావిగేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, సౌండ్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ లాంటివి ఉంటాయి. లేటెస్ట్ స్కోడా కొడియాక్ కూడా అదే 2 లీటర్ టర్బో పెట్రోల్ కలిగి ఉంది. దీంతో పనితీరులో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 190 హెచ్ పీ పవర్, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 7. 8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి. మీ వరకు వేగవంతం అవుతుంది.
అయితే ఈ కారు కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అవ్వడం వల్ల మెరుగైన ఇంజిన్ సామర్థ్యం అందిస్తుంది. స్కోడా కంపెనీ ఈ కొడియాక్ కారులో 9 ఎయిర్ బ్యాగులను అందించింది. ఇందులో బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టి కొలిజన్ బ్రేకింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.