Site icon Prime9

Samsung Galaxy S23: అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్.. ఫోన్‍ల ధరలు, స్పెసిఫికేషన్స్ ఇవే..

samsung galaxy S23

samsung galaxy S23

Samsung Galaxy S23: ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్లో తీసుకొస్తుంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్. తాజాగా శాంసంగ్ నుంచి సరికొత్త ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.

గెలాక్సీ సిరీస్ లో ఎస్23 వేరియంట్లను ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్ 23 (Samsung galaxy s23), శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23+(samsung galaxy s23+),

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా (Samsung Galaxy S23 ultra)ల పేరుతో మూడు వేరియంట్లను తీసుకొచ్చింది.

 

ప్రీ బుకింగ్స్ సదుపాయం

ఈ న్యూ శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లు రూ. 74,999 నుంచి ప్రారంభమవుతాయి. సరికొత్త శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఫిబ్రవరి 17 నుంచి మూడు వేరియంట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్లను బుక్ చేసుకోవాలనుకుంటే .. శాంసంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్స్, అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా కొనవచ్చు.

ప్రీ బుకింగ్ చేసుకోవడానికి ముందుగా రూ. 1,999 లు చెల్లించాల్సి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 స్మార్ట్ ఫోన్లను ప్రీ బుక్ చేసుకున్నవారికి రూ. 5000 విలువైన బెనిఫిట్స్ పొందేందుకు వీలు కల్పించారు.

కానీ ఆఫర్ ను పొందాలంటే మార్చి 31, 2023 లోపు న్యూ మోడల్స్ లోని ఫోన్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

గెలాక్సీ ఎస్23 సిరిసీ ధరలు , ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 74,999 గా నిర్ణయించారు. 8 జీబీ+256 జీబీ స్టోరేజ్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 79,999 గా ఉంది.

ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23+ మోడల్ లో 8జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్ ధర రూ. 94,999 గాను, 8జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 1,04,999 గా నిర్ణయించారు.

ఇక అన్నింటి కన్నా ప్రీమియం మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఆల్ట్రా. ఈ మోడల్ లో 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ. 1,24,999 గాను, 12జీబీ+512 జీబీ వేరియంట్ ధర రూ. 1,34,999 గాను ,

12జీబీ+1 టీబీ వేరియంట్ ధరను రూ. 1,54,999 గా శాంసంగ్ నిర్ణయించింది.

ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

గెలాక్సీ ఎస్23 అల్ట్రా లో అదనంగా రెడ్ , గ్రాఫైట్, లైమ్, స్కైబ్లూ కలర్స్ దొరుకుతాయి. ఇవి కేవలం శాంసంగ్ వెబ్ సైట్ లోనే లభిస్తాయి.

గెలాక్సీ ఎస్23 స్మార్ట్ ఫోన్ భారత్ లోనే తయారు చేయనున్నట్టు శాంసంగ్ ప్రకటించింది.

భారత్ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

 

సిరీస్ స్పెసిఫికేషన్స్ (Samsung Galaxy S23)

గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో డిస్‌ప్లే అమర్చారు.

క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్ ‌2 ప్రాసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 12 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10 ఎంపీ టెలీఫోటో కెమెరాను అమర్చారు.

ముందు వైపు 12 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5జీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, ఐపీ68 రేటింగ్‌ కలిగిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ అందిస్తున్నారు.

3900 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25W వైర్డ్‌ ఛార్జింగ్‌కు, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్‌ చేస్తుంది.

గెలాక్సీ S23+ కూడా 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.

స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. ఎస్‌23లో ఉన్న మూడు కెమెరాలనే ఇందులోనూ ఇచ్చారు.

ఇందులో 4,700 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. 45W వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో పాటు రివర్స్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఈ మోడల్ లో ఉంది.

గెలాక్సీ S23 అల్ట్రా లో 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ డైనమిక్‌ అమోలెడ్‌ 2 ఎక్స్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ వినియోగించారు. ఇందులో అన్నింటి కన్నా హైలెట్ మెయిన్ కెమెరా.. 200 మెగా పిక్సెల్ తో పాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 10 ఎంపీ టెలీఫోటో లెన్స్‌ను

ఇందులో వినియోగించారు. ముందు వైపు 12 ఎంపీ సెన్సర్‌ను వాడారు. ఇందులో ఎస్‌-పెన్‌ సదుపాయం ఇస్తున్నారు.

స్టైలస్‌ను ఫోన్‌తో పాటే ఇస్తున్నారు. ఐపీ68 రేటింగ్‌ కలిగిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉంది.

ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W వైర్డ్‌ ఛార్జింగ్‌, 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. రివర్స్‌ ఛార్జింగ్‌ కూడా అందుబాటులో ఉంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version