Realme Narzo N53: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో రియల్ మీ నజ్రో N53 పేరుతో సరికొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది. నార్జో ఎన్ సిరీస్ లో వచ్చిన రెండో ఫోన్ ఇది. కాగా గత నెలలో నజ్రో N55 ను రియల్ మీ రిలీజ్ చేసింది. తక్కువ ధరలో 4 జీ ఫోన్ కోసం చేసే వారు ఈ ఫోన్ ను చూడొచ్చు.
Narzo N53 ధరెంత?(Realme Narzo N53)
Realme Narzo N53 ఫోన్ రెండు వేరియంట్స్ లో వస్తోంది. 4జీబీ+ 64 జీబీ వేరియంట్ ధర రూ. 8,999 గా కంపెనీ నిర్ణయించింది. అదే విధంగా 6జీబీ+ 128 జీబీ వేరియంట్ ధరను రూ. 10,999 గా పేర్కొంది. ఈ ఫోన్ అమ్మకాలు మే 24 న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ ఫోన్ పై కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డు తో 1000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఫస్ట్ సేల్ లో భాగంగా 4 జీబీ వేరియంట్ ను రూ. 500, 6జీబీ వేరియంట్ ను రూ. 1000 డిస్కౌంట్ పై విక్రయిస్తున్నారు. మే 22 మధ్యాహ్నం 2 -4 గంటల మధ్య రూ. 1000 ల వరకు డిస్కౌంట్ తో స్పెషల్ సేల్ నిర్వహించనున్నట్టు రియల్ మీ పేర్కొంది.
ఫీచర్స్ విషయానికి వస్తే..
రియల్ మీ నార్జో ఎన్ 53 ఫీచర్లను చూస్తే.. 6.74 ఇంచుల డిస్ ప్లే మార్చి.. 90HZ రిఫ్రెష్ రేటుతో ఈ డిస్ ప్లే వస్తోంది. ఇందులో అక్టాకోర్ యునిసోక్ టీ612 ప్రాసెసర్ ను అమర్చారు. ఆండ్రాయిడ్ 13 తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. వెనుక వైపు 50 ఎంపీ మెయిన్ కెమెరాతో.. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా లభిస్తోంది. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తోంది. ఈ ఫోన్ రెండు కలర్స్ .. బ్లాక్ , గోల్డ్ లలో లభిస్తోంది.