Realme Narzo N53: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. రియల్ మీ నజ్రో N53 పేరుతో ఈ నెల 18న స్లిమ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది. గత నెలలో నజ్రో N55ను రిలీజ్ చేశారు. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 10,999 గా ఉంది. అయితే తాజాగా తీసుకొస్తున్న నజ్రో N53 ఫోన్ ధర మరింత తక్కువ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఎన్ సిరీస్ లో రెండో ఫోన్(Realme Narzo N53)
రెండు నెలల వ్యవధిలోనే ఎన్ సిరీస్ లో వస్తోన్న రెండో స్మార్ట్ ఫోన్ ఇది. కాగా, అధికారికంగా ఈ ఫోన్ విడుదలవ్వక ముందే ఈ ఫోన్ ను సంబంధించిన కొన్ని ఫీచర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కంపెనీ ఇప్పటికే కొత్త ఫోన్ ఫొటో ను విడుదల చేసింది. దాని ప్రకారం ఎన్ 53 ఫోన్ గోల్డ్ ఫిష్ కలర్ లో తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు ఈ కలర్ తో ఫోన్ ను కంపెనీ తీసుకురాలేదు. ఫోన్ వెనుక వైపు 3 కటౌట్స్ ఉన్నాయి. అందులో 2 కెమెరాలు, 1 ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ లు ఉన్నాయి.
అమెజాన్ లో అమ్మకాలు
కాగా కంపెనీ విడుదల చేసిన ఇమేజ్ ప్రకారం.. నజ్రో ఎన్53 ఫోన్ గోల్డ్ ఫిష్ కలర్‌లో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. ఇప్పటివరకు నజ్రో సిరీస్‌లో ఇలాంటి ఫోన్లు రాలేదనే విషయం తెలిసిందే. ఫోన్ వెనుక ప్యానల్‌లో 3 కటౌట్స్ ఉండగా అందులో 2 కెమెరాలు, 1 ఎల్‌ఈడీ ఫ్లాష్‌గా ఉన్నాయి. ఫోన్ కుడివైపు వాల్యూమ్ రాకర్స్ , పవర్ బటన్ లు ఉన్నాయి. పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ గా కూడా పనిచేయనుంది. 16GB వర్చువల్ ర్యామ్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే 5000 m AH ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే లాంచ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. ఈ రియల్‌మీ నజ్రో ఎన్53 ఫోన్ అమెజాన్ లో అమ్మకానికి సిద్ధంగా ఉండనుంది.