Site icon Prime9

Poco X5 Pro 5G: ఓపెన్ సేల్ ప్రారంభించిన పొకో ఎక్స్ 5 ప్రో 5జీ

Poco X5 Pro 5G

Poco X5 Pro 5G

Poco X5 Pro 5G: ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్‌లోకి పొకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ఓపెన్ సేల్ ప్రారంభమైంది. గత వారం లాంచ్ తర్వాత కొంతసేపు సేల్‍కు ఉన్న ఈ ఫోన్.. నేడు పూర్తిస్థాయిలో సేల్‍కు వచ్చింది.

ఈసేల్ సందర్భంగా బ్యాంక్ కార్డులతె 2 వేల వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అడ్రెనో 642ఎల్ జీపీయూతోపాటు ఒక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 778జీ ఎస్వోసీ ప్రాసెస‌ర్‌తో వ‌స్తున్న‌ది. ఎంఐయూఐ14 స్కిన్ ఆప్ టాప్‌తోపాటు ఆండ్రాయిడ్ 12 వ‌ర్ష‌న్‌తో ప‌ని చేస్తుందీ ఫోన్‌.

ఇందులో డ్యుయ‌ల్ సిమ్ సామ‌ర్థ్యం ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ఎక్స్‌ఫినిటీ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 120హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌తో వ‌స్తోంది. 900 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. 108 మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెట‌ప్ ఫెసిలిటీ ఉంది. ఈ కెమెరాల్లో 30ఎఫ్‌పీఎస్ వ‌ద్ద‌ 4కే వీడియోల రికార్డింగ్ కెపాసిటీ ఉంటుంది.

ఇప్ప‌టికే గ్లోబ‌ల్ మార్కెట్‌లో పొకో ఎక్స్‌5 5జీ ఫోన్‌ను ఆవిష్క‌రించింది. పొకో ఎక్స్‌5 ప్రో ఫోన్ రెండు మోడ‌ల్స్‌లో రిలీజ్ అయింది. బేస్ వేరియంట్ ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ, 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీతో ఉంది. 6జీబీ రామ్ కెపాసిటీ ఫోన్ రూ. 22,999, 8జీబీ రామ్ సామ‌ర్థ్యం గ‌ల ఫోన్ రూ. 24,999 లకు లభిస్తోంది.

స్పెషిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు ఇవే(Poco X5 Pro 5G)

6.67 అంగుళాల ఎక్స్‌ఫినిటీ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 120హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌
900 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్
డిస్‌ప్లేలో 240 హెర్ట్జ్ ట‌చ్ శాంపిల్ రేట్‌, హెచ్‌డీఆర్ 10 + స‌పోర్ట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌
778జీ ఎస్వోసీ స్నాప్‌డ్రాగ‌న్ విత్ అడ్రెనో 642ఎల్ జీపీయూ
8జీబీ ఆఫ్ ఎల్పీడీడీఆర్4 ఎక్స్ రామ్‌.. 256 ఆఫ్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ కెపాసిటీ
ట్రిపుల్ రేర్ కెమెరా ఆప్ష‌న్స్‌
108 మెగా పిక్సెల్ ఐసోసెల్ హెచ్ఎం2 మెయ‌న్ సెన్స‌ర్‌

8 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌
2 మెగా పిక్సెల్ మాక్రో షూట‌ర్‌
30ఎఫ్‌పీఎస్ వ‌ద్ద 4కే వీడియోల రికార్డింగ్ సామ‌ర్థ్యం
సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 120ఎఫ్‌పీఎస్ వ‌ద్ద ఫుల్-హెచ్డీ వీడియోల రికార్డ్ కెపాసిటీ
5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం
67వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, 5వాట్ల వైర్ రివ‌ర్స్ చార్జింగ్ ఫెసిలిటీ
ఎంఐయూఐ 14 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది
రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్‌కు హామీ.. మూడేండ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్‌
యూఎస్బీ టైప్‌-సీపోర్ట్‌, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ల‌భ్యం
డ్యుయ‌ల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 వైర్‌లెస్ క‌నెక్ట్‌విటీ

Exit mobile version