Vodafone Layoffs: ఆర్ధిక మాంద్యం వేళ ఉద్యోగల కోత కొనసాగుతుంది. ఇప్పటికే పలు కంపెనీలు చాలామందిని ఇంటిని పంపించాయి. తాజాగా వోడాఫోన్ కూడా.. భారీగా ఉద్యోగుల కోతకు ప్లాన్ వేసింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. సుమారు11 వేల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆర్ధిక మాంద్యం వేళ ఉద్యోగల కోత కొనసాగుతుంది. ఇప్పటికే పలు కంపెనీలు చాలామందిని ఇంటిని పంపించాయి. తాజాగా వోడాఫోన్ కూడా.. భారీగా ఉద్యోగుల కోతకు ప్లాన్ వేసింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. సుమారు11 వేల మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సీఈఓ.. మార్గరీటా డెల్లా ప్రకటించారు. సంస్థ ఖర్చులను ఆదా చేసేందుకు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించాలని కంపెనీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
బ్రిటీష్ టెలికాం దిగ్గజ కంపెనీ వొడాఫోన్ వచ్చే మూడేళ్లలో 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్ లో కంపెనీ షేరు ధర రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు టెలికం రంగంలో పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి వోడాఫోన్ ప్రయత్నిస్తోంది. కంపెనీ ఖర్చు తగ్గించుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత నెలలో సీఈఓగా డెల్లా నియమితులయ్యారు. అప్పటినుంచి అనేక చర్యలను తీసుకున్నారు. ఉద్యోగుల పనితీరు.. పలు మార్పులపై కీలక సూచనలు చేశారు.
అందులో భాగంగానే ఉద్యోగాల కోత విధించనున్నారు.
ఇప్పుడు వోడాఫోన్‌ను మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించేందుకు ప్రణాళికలు వేస్తోందని సీఈఓ తెలిపారు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను భారీగా తగ్గించే ప్రణాళికల్లో భాగంగానే ఉద్యోగాల కోత విధించనున్నట్టు చెప్పారు.
ఈ ప్రణాళికలతో కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతలను విధించనుంది. అంటే.. దాదాపు 11వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
అంతకుముందు నవంబర్ 2022లో, వోడాఫోన్ వార్షిక లాభాల అంచనాను తగ్గించింది.
ఆ తర్వాత ఇంధన బిల్లులు, ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించేందుకు ఉద్యోగాల కోతలతో సహా ఖర్చు తగ్గించే ప్రణాళికను ప్రకటించింది.
డిసెంబరులో నాలుగేళ్ల పదవీ కాలంలో మార్కెట్ విలువలో 40 శాతం క్షీణించింది. ఆ తర్వాత సీఈఓ నిక్ రీడ్ పదవి నుంచి వైదొలిగారు.
వోడాఫోన్ యూకే కార్యకలాపాలను సీకే హచిసన్ యాజమాన్యంలోని పోటీదారు త్రీ యూకేలో విలీనం చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.