Site icon Prime9

OnePlusPad: మార్కెట్లోకి వన్ ప్లస్ టాబ్లెట్.. ధర, ఫీచర్స్ పై ఓ లుక్కేయండి

OnePlusPad

OnePlusPad

OnePlusPad: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ టాబ్లెట్ విభాగంలో అడుగు పెట్టింది. వన్ ప్లస్ తన తొలి ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్‌ను మార్కెట్ లో విడుదల చేసింది. ఫిబ్రవరిలో ఈ ట్యాబ్‍ను భారత్‍లో వన్‍ప్లస్ లాంచ్ చేయగా.. ఇప్పుడు ధర, సేల్ వివరాలను వెల్లడించింది. మీడియాటెక్ డైమన్సిటీ 9000 చిప్‌సెట్‌, కార్టెక్స్-X2 కోర్ 3.05GHz,2.8K రెజల్యూషన్ డిస్‍ప్లే,నాలుగు స్పీకర్లు లాంటి ఫీచర్లను కొత్త టాబ్లెట్ లో తీసుకొచ్చింది.

OnePlus Pad | OnePlus India

వన్‍ప్లస్ ప్యాడ్ పూర్తి వివరాలివే..(OnePlusPad)

వన్‌ప్లస్ ప్యాడ్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8 జీబీ ర్యామ్‌ +128 GB స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌+ 256 GB స్టోరేజ్‌ ఆప్షన్లలో లాంచ్‌ చేసింది. ఈ ట్యాబ్లెట్ లు ధరలు రూ. 37,999, రూ. 39,999 లుగా కంపెనీ నిర్ణయించింది. ఈ నెల 28 నుంచి వన్‌ప్లస్ యాప్‌, ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌తో పాటు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఈ కామర్స్‌ సైట్లలోనూ, రిలయన్స్ క్రోమా స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2000 తక్షణ తగ్గింపు వస్తుంది.

ప్రముఖ బ్యాంకుల కార్డులపై 12 నెలల పాటు ఉచిత ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ప్యాడ్ హోలో గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభ్యమవుతోంది. ఒక వేళ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ల ఎక్సేంజ్ చేస్తే అదనంగా రూ. 5000 లేదా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌ల మార్పిడిపై రూ. 3000 ఆఫర్‌ లభిస్తోంది. ఏప్రిల్‌ 28 నుంచి ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చు.

 

 

వన్‌ప్లస్ టాబ్లెట్ ఫీచర్లివే..

2.8K రెజల్యూషన్ డిస్‍ప్లే,
నాలుగు స్పీకర్లు
11.61-అంగుళాల 144 Hz రీడ్-ఫిట్ డిస్‌ప్లే
7:5 స్క్రీన్ నిష్పత్తి, మెటల్ బాడీ
9510mAh బ్యాటరీ, 67w ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌

13 ఎంపీ రియర్‌ కెమెరా

144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్ , డాల్బీ అట్మోస్ సపోర్ట్‌

2.5D రౌండ్ ఎడ్జ్ కాంబెర్డ్ ఫ్రేమ్ డిజైన్‌
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
OxygenOS 13.1 సాఫ్ట్ వేర్ రన్ అవుతుంది.

Exit mobile version
Skip to toolbar