Site icon Prime9

Nothing Phone 2: ఈ సారి బలమైన బ్యాటరీతో ‘నంథింగ్ ఫోన్ 2’ .. విడుదల ఎప్పుడంటే?

Nothing Phone 2

Nothing Phone 2

Nothing Phone 2: ‘నథింగ్’ నుంచి గత ఏడాది అట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లతో తొలి స్మార్ట్ ఫోన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ 2 ను జులైలో మార్కెట్ లోకి తీసుకురానున్నట్టు కంపెనీ సీఈఓ కార్ల్ పే వెల్లడించారు.

 

 అమెరికా మార్కెట్ లో ఫోన్ 2(Nothing Phone 2)

నథింగ్ ఫోన్ 2 కూడా ఆకర్షణీయ డిజైన్, ఫీచర్లతో సహా బలమైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. ఫోన్ 1 లో 4500 mAh బ్యాటరీని అందించగా.. ఫోన్ 2 లో 4700mAh బ్యాటరీతో వస్తందన్నారు. కాగా, ఫోన్ 1 ను అమెరికా మార్కెట్ లో ప్రవేశపెట్టని నంథింగ్ .. ఫోన్ 2 ను మాత్రం అక్కడ రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది.

ఫోన్ 1 లో మిడ్ రేంజ్ ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ + ప్రాసెసర్ తో వచ్చింది. అదే విధంగా నంథింగ్ ఫోన్ 2 లో స్నాప్ డ్రాగన్ 8 + జెన్ 1 ప్రాసెసర్ ఉంటుందని కార్ల్ పే చెప్పారు.

 

భారత్ సహా పలు దేశాల్లో

గత ఏడాది జులైలో నథింగ్ కంపెనీ తన తొలి స్మార్ట్ ఫోన్ ను భారత్ తో సహా పలు దేశాల్లో విడుదల చేసింది. 6.55 ఇంచుల ఓఎల్ఈడీ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 78జీ+ చిప్ సెట్ తో వచ్చిన ఈ ఫోన్ లో వెనుక రెండు 50 MP, సెన్సార్లతో కూడిక కెమెరాలున్నాయి. 4500 mAh బ్యాటరీ, 33 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఇందులో నోటిఫికేషన్ల కోసం ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 1 విడుదల టైమ్ లో 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజీ మోడల్ ధరను రూ. 32,999 గా ఉంది. అయితే పలు ఆఫర్లు, డిస్కౌంట్ల తో ధరలు కొంత మేర తగ్గాయి. కాగా నంథింగ్ ఫోన్ 2 ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 

 

Exit mobile version