Site icon Prime9

Nokia C12 Pro: నోకియా నుంచి అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్

Nokia C12 Pro

Nokia C12 Pro

Nokia C12 Pro: మార్కెట్ లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా హెచ్ఎండీ గ్లోబల్ భారత్ లో నోకియా సీ12 ప్రో అనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో రెండు స్టోరేజ్, 3 రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

నోకియా సీ12 ధర, ఫీచర్స్ ఇవే.. (Nokia C12 Pro)
నోకియా సీ12 రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజ్‌ ధర రూ. 6,999గా కంపెనీ నిర్ణయించింది. 3జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజ్‌ ఉన్న వేరియంట్‌ ధర రూ. 7,499 గా నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లు 2 జీబీ వర్చువల్‌ ర్యామ్‌ను సపోర్ట్‌ చేస్తాయి. లైట్‌ మింట్‌, చార్‌కోల్‌, డార్క్‌ సియాన్‌ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. నోకియా సీ12 ప్రోలో 60Hz రీఫ్రెష్‌ రేటుతో 6.3 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ, హెచ్‌డీ+ రెజల్యూషన్‌తో కూడిన తెరను అమర్చారు. ఈ ఫోన్ డ్యుయల్‌ సిమ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 (గో ఎడిషన్‌) ఓఎస్‌ను ఇస్తున్నారు. రెండేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇవ్వనున్నారు. అలాగే రెండేళ్ల రీప్లేస్‌మెంట్‌ గ్యారెంటీని కూడా ఆఫర్‌ చేస్తున్నారు.

ఈ ఫోన్ వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 8 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ కెమెరాను ఇస్తున్నారు. 10 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కలిగిన 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు.

Exit mobile version