Site icon Prime9

Moto Watches: మోటోరోలా నుంచి వస్తున్న వాచెస్ పై ఓ లుక్కేయండి

Moto Watches

Moto Watches

Moto Watches: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు మోటోరోలా త్వరలో మోటో వాచ్‌లను విడుదల చేసేందుకు సిద్దం అయింది. కొన్ని కీలక స్పెక్స్, డిజైన్‌లతో టెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌లను వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మోటో స్మార్ట్‌వాచ్ లైనప్‌లో మోటోవాచ్‌ 70, మోటోవాచ్‌ 200 లను కంపెనీ లిస్ట్‌ చేసింది. బడ్జెట్ ,సెంట్రిక్ వినియోగదారుల కోసం మోటో వాచ్‌ 70ని, ప్రీమియం ఫీచర్స్ తో మోటో వాచ్‌ 200 ద్వారా ప్రీమియం స్మార్ట్ వాచ్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

 

మోటో వాచ్‌ 200(Moto Watches)

మోటో వాచ్‌ 200 ఫీచర్లను చూస్తూ 1.78 అంగుళాల డిస్‌ప్లే, 355 ఎంఏహెచ్‌ బ్యాటరీ(ఒక సారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు), 5 ఏటియం వాటర్‌ప్రూఫ్‌, హార్ట్‌రేట్‌ మానిటర్‌ ఎస్పీవో2 మీటర్‌, 5.3 ఎల్‌ఈ బ్లూటూత్‌, బిల్డ్‌–ఇన్‌ జీపిఎస్‌ మైక్రోఫోన్, వార్మ్ గోల్డ్ అండ్‌ ఫాంటమ్ బ్లాక్ కలర్స్ లో స్పీకర్స్ లు వస్తున్నాయి. అయితే కంపెనీ ఇంకా దీని ధరను వెల్లడించలేదు. మార్కెట్ నిపుణల ప్రకారం ధర సుమారు రూ. 12 వేలు (149.99 డాలర్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Moto Watch 200

మోటో వాచ్ 70

మోటో వాచ్ 70 ఫీచర్స్ విషయానికి వస్తే.. 1.69 అంగుళాల కర్వ్‌డ్‌ LCD డిప్‌స్లే, 43 mm జింక్ అల్లాయ్ కేస్‌, హార్ట్‌రేట్‌ మానిటర్ , టెంపరేచర్‌ సెన్సార్‌, స్లీప్ ట్రాకింగ్‌ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి.

Moto Watch 70

Exit mobile version
Skip to toolbar