Maruti Suzuki: పర్యావరణ పరిరక్షణ కోసం దిగ్గర కార్ల కంపెనీ మారుతీ సుజుకీ అడుగులేస్తోంది. ఇకపై కంపెనీ నుంచి రాబోయే సీఎన్జీ మోడళ్ల కార్లను నడపడానికి ఆవుపేడ(cow dung) తో ఉత్పత్తయ్యే బయోగ్యాస్
ను ఉపయోగించనున్నట్టు తెలిపింది.
ఈ మేరకు అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ బనాస్ డెయిరీ, భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుతో సుజుకీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారు చేసే ఫ్యుజిసాన్ అస్గిరి బయోమాస్ సంస్థలోనూ పెట్టుబడులు పెట్టామని.. ఈ కంపెనీతో కలిసి టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.
డెయిరీ వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి(Maruti Suzuki)
ఫుల్ రేంజ్ ప్రొడక్ట్స్, సర్వీసులు అందించేలా కంపెనీ భావిస్తోంది. బ్యాటరీ ఆధారిత ఈవీలు మాత్రమే కాకుండా సీఎన్జీ, బయోగ్యాస్, ఇథనాల్, మిక్స్‌డ్ ఫ్యూయల్స్ వాడకంతో
కార్బన్ న్యూట్రల్ కంబుష్టన్ ఇంజిన్‌లతో నడిచే కార్లను అందించేందుకు మారుతి సుజుకి తలపెట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వెలువడే డెయిరీ వ్యర్థాలు, ఆవు పేడ నుంచి వచ్చే బయోగ్యాస్‌ను దారి మళ్లించడం ద్వారా బయోగ్యాస్ బిజినెస్‌కు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించవచ్చని మారుతి
సుజుకి తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఆవుపేడ, ఇతర డెయిరీ వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి సరఫరా చేయొచ్చు.
ఆవుపేడ, ఇతర డెయిరీ వ్యర్థాలతో ఉత్పత్తి చేసే బయో గ్యాస్‌తో మారుతి సుజుకి సీఎన్జీ మోడల్ కార్లకు ఉపయోగించవచ్చు.
అదే జరిగితే దాదాపు 70 శాతం సీఎన్జీ కార్ మార్కెట్లకు ఈ బయోగ్యాస్ సరిపోతుందని మారుతి సుజుకి చెబుతోంది.
ఈ ప్రాజెక్టును భారత్‌కు మాత్రమే పరిమితం చేయడం లేదని.. భవిష్యత్‌లో జపాన్, ఆఫ్రికా, ఆసియా దేశాలతో పాటు ఇతర వ్యవసాయ ఆధారిత దేశాల్లో కూడా ఈ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని
కంపెనీ ప్రయత్నిస్తోంది.
భారత సీఎన్జీ కార్ల మార్కెట్ లో మారుతీ సుజుకీ కి దాదాపు 70 శాతం వాటా ఉంది. 2010 లో మారుతి ఆల్టో, ఈకో, వ్యాగనార్ అనూ మోడళ్లతో సీఎన్జీ కార్లను మార్కెట్లో విక్రయించింది.
కంపెనీ ఇప్పటి వరకు 1.14 మిలియన్లకు పైగా కార్లను విక్రయించింది. కార్భన్ డయాక్సైడ్ ఉద్గారాల సవాలును పరిష్కరించడానికి సుజుకి ఎంచుకొన్న మార్గం బయోగ్యాస్ అని సంస్థ తెలిపింది.
ఈ మేరకు సీఎన్జీ కార్లలో బయోగ్యాస్ ను ఉపయోగించవచ్చని పేర్కొంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/