Site icon Prime9

Maruti Suzuki Jimny: ఎట్టకేలకు మార్కెట్ లోకి మారుతీ సుజుకీ జిమ్నీ

Maruti Suzuki Jimny

Maruti Suzuki Jimny

Maruti Suzuki Jimny: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతీ సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు మార్కెట్ లోకి వచ్చేసింది. ఆటో ఎక్స్ పో 2023 లో ఈ వెహికల్ న పరిచయం చేసినప్పటి నుంచి దీని విడుదలపై గత కొంతకాలంగా ఉత్కంఠ కొనసాగింది. మారుతీ సుజుకీ జిమ్నీ బుకింగ్స్ గతంలోనే ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు 30 వేల ఆర్డర్లు లభించాయి. భారత్ లో రూ. 12.74 లక్షల నుంచి రూ. 15.05 లక్షలుగా ధరగా ఉంది. జూన్ మిడిల్ లో ఈ కార్ల డెలివరీ చేస్తున్నట్టు డీలర్లు తెలిపారు.

 

జిమ్నీ స్పెసిఫికేషన్లు..(Maruti Suzuki Jimny)

మారుతీ సుజుకీ జిమ్నీ అల్ఫా, జెటా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 1.5 లీటర్‌, 4 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ 105 హెచ్‌పీ శక్తిని, 134 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుందని కంపెనీ తెలిపింది. 5 స్పీడ్‌ మాన్యువల్‌, 4 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను ఇందులో పొందుపర్చారు. మాన్యువల్‌ వేరియంట్‌ లీటర్‌ కు 16.94 కి.మీ, అదే విధంగా ఆటో మేటిక్ వేరియంట్‌ లీటర్‌కు 16.39 కి.మీ మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. 5 డోర్లతో వస్తున్న ఈ కారుకు 210 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉంది.

 

జిమ్నీ ఫీచర్లు..

భారత్‌లో చవకైన 4X4 కారుగా మారుతి సుజుకి జిమ్నీ అవతరించింది. జిమ్నీఅల్ఫా ట్రిమ్‌లో ఆటోమేటిక్‌ ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్‌, కీలెస్‌ ఎంట్రీ, వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో , ఆటో మేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్ లాంటి భద్రతా ఫీచర్లను అన్ని ట్రిమ్‌లలో ఇస్తున్నారు. మొత్తం 7 రంగుల్లో ఈ ఎస్‌యూవీ లబిస్తోంది. 5 డోర్లు ఇస్తున్నప్పటికీ.. ఇది 4 సీటర్‌ వాహనం. మహీంద్రా థార్‌, ఫోర్స్‌ గూర్ఖాకు మారుతీ సుజుకీ జిమ్నీ పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 

Exit mobile version