Mahindra Record Sales: మార్చి నెలలో ఆ కారును విపరీతంగా కొన్నారట..

మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రికల్ వాహనాల సెగ్మెంట్లలో సత్తా చాటడానికి మహీంద్రా అడుులు వేస్తోంది.

Mahindra Record Sales: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన వాహన అమ్మకాల్లో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా ఎస్ యూవీ సెగ్మెంట్ లో తిరుగులేని సత్తా చాటింది. ఇప్పటి వరకు అమ్మకాల్లో ఎప్పుడూ లేని విధంగా మరింత వ‌ృద్ధిని నమోదు చేసుకుంది. మార్చి నెలలో 35 వేల 976 యూనిట్ల మహీంద్రా ఎస్ యూవీ లు విక్రయించినట్టు కంపెనీ వెల్లడించింది. ఓవరాల్ గా అన్ని సెగ్మెంట్లలో 66 వేల 091 వాహనాలు అమ్మినట్టు ప్రకటించింది.

60 శాతం వృద్థి(Mahindra Record Sales)

మార్చి ,2023 ఎస్ యూవీ అమ్మకాల్లో 31 శాతం వృద్ధిని చూసినట్టు తెలిపింది. అన్ని విభాగాల్లో 60 శాతం వృద్ధి సాధించామని కంపెనీ పేర్కొంది. అదే విధంగా ఒక్క ఎస్ యూవీ లే కాకుండా మహీంద్రా ఎక్స్ యూవీ700, బొలెరో నియో, స్కార్పియో ఎన్ అమ్మకాలు కూడా మార్చిలో బాగా పెరిగినట్టు తెలిపింది. కంపెనీ వృద్ధిలో వీటి అమ్మకాలు కూడా తోడయ్యాయి. 2020 లో మహీంద్రా రిలీజ్ చేసిన థార్ అమ్మకాలు కూడా మార్చిలో బాగా పెరిగాయి.

 

ఈవీ వెర్షన్ లో సత్తా చాటేందుకు

మరో వైపు మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రికల్ వాహనాల సెగ్మెంట్లలో సత్తా చాటడానికి మహీంద్రా అడుులు వేస్తోంది. ఈ క్రమంలో 2023 లోనే మహీంద్రా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీని దేశీయ మార్కెట్లలోకి విడుదల చేసింది. ఎక్స్ యూవీ 400 లో ఈవీ వెర్షన్ ను తీసుకొచ్చింది. అయితే ఈ వాహనం కోసం 18 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్టు మహీంద్రా తెలిపింది.