Site icon Prime9

Jio 5G Smart Phone: జియో 5జీ ఫోన్‌ ఎలా ఉండనుందో తెలుసా..? ధర, ఫీచర్ల ఇవే

jio 5G Smart Phones

jio 5G Smart Phones

Jio 5G Smart Phone: మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. కస్టమర్ల అభిరుచులు, ఆసక్తికి తగినట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మొబైల్ కంపెనీలు ప్రొడక్ట్స్ ను తీసుకువస్తుంటాయి. మారుతున్న కాలం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా మొబైల్ ఫోన్స్‌ను ఒకదానిని మించి ఇంకొక సరికొత్త ఫీచర్లు సరికొత్త టెక్నాలజీతో కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో టెలికం రంగంలో సరికొత్త విప్లవంలా దూసుకొచ్చింది రిలయన్స్‌ జియో. భారత్ లో జియో సృష్టించిన వండర్స్ ఎన్నో.. 4జీ నెట్‌వర్క్‌ను తక్కువ ధరకు అందించి కొత్త చరిత్ర సృష్టించింది జియో. ఇదే క్రమంలో హ్యాండ్‌సెట్లను కూడా విడుదల చేస్తూ వస్తోంది జియో.

ఇప్పటికే 3జీ, 4జీ ఫోన్‌ను లాంచ్‌ చేసిన జియో.. తాజాగా ప్రపంచం అంతా చూస్తున్న 5జీవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది జియో. త్వరలోనే జియో నుంచి 5జీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు రిలయన్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీపావళి లేదా ఈ ఏడాది చివర్లో జియో 5జీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే రిలయన్స్‌ మాత్రం ఇప్పటి వరకు ఈ 5జీ ఫోన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా 5జీ ఫోన్‌ ఫీచర్లు ఇవేనంటూ నెట్టింట కొన్ని పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ట్విట్టర్‌ వేదికగా జియో 5జీ ఫోన్ ఫొటోలతో పాటు, ఫీచర్లు, ధరకు సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ జియో ఫోన్‌ చూడడానికి ఎలా ఉండనుంది.? ఫీచర్లు ఏంటి.? అనే వివరాలు మీకోసం.. నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం జియో 5జీ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉండనుంది.

ఫీచర్లు ఇవే(Jio 5G Smart Phone)

ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌ 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో రానుంది. 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో 18 W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే అవకాశం ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే రూ. 8 నుంచి రూ. 12 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమాచారాం అంతా నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version
Skip to toolbar