Site icon Prime9

Coca-Cola Smartphone: భారత్ లో లాంచ్ అయిన రియల్ మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్..

Coca-Cola Smartphone

Coca-Cola Smartphone

Coca-Cola Smartphone: కోకాకోలా తో కలిసి రియల్ మీ సరికొత్త కోకాకోలా ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. రియల్ మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్ పేరుతో మార్కెట్ లోకి తీసుకొచ్చింది.

ఈ ఎడిషన్ కు డిజైన్, ఫోన్ బ్యాక్ ప్యానెల్ కోకాకోలా లోగో స్పెషల్ అట్రాక్షన్. సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకాకోలా గుర్తుకొచ్చేలా ఈ స్మార్ట్ పోన్ లుక్ ను రూపొందించారు. ఈ ఫోన్ లో మరో ప్రత్యేకత ఏంటంటే కోకాకోలా ప్రత్యేక రింగ్ టోన్ ను రూపొందించారు.

మరెన్నో ఫీచర్లు(Coca-Cola Smartphone)

ఈ కోకాకోలా స్పెషల్ ఎడిషన్ మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. చార్జర్ , కేబుల్ సహా రియల్ మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్ స్పెషల్ ప్యాకేజ్ తో యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ ఫోన్ లోని యాప్ లను కస్టమైజ్డ్ యూఐతో రీడైజన్ చేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 సపోర్ట్ తో కోకాకోలా థీమ్ తో డిజైన్ చేసిన ఓఎస్ తో పనిచేస్తుంది.

33 డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 6.72 ఇంచుల ఐపీఎస్ ఎల్ సీడీ స్క్రీన్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు అందించారు. 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ తో లభించే ఈ ఫోన్ ధర రూ. 20,999 గా కంపెనీ నిర్ణయించింది.

The Coca-Cola phone is a real thing, and absolutely stunning | Digital  Trends

ఎటు చూసినా కోకా కోలా గుర్తు వచ్చేలా..

ఈ ఎడిషన్ లో స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ తో పాటు 108 ఎంపీ తో ప్రధాన కెమెరాను అందించారు. సెకండరీ కెమెరాను 2 ఎంపీ తో ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగాన 16 ఎంపీ కెమెరా ను అమర్చారు. 1980 లో ఫొటోగ్రఫీ స్టయిల్ లో మార్చకునేలా ఇచ్చిన కోలా ఫిల్టర్ ఈ ఫోన్ లో ప్రత్యేక ఆకర్షణ.

ఈ ఫోన్ లో ఫొటో తీసినపుడు కెమెరా షటర్ సౌండ్ కూడా కోకా కోలా బాటిల్ మూత తెరిచినపుడు వచ్చే సౌండ్ లా డిజైన్ చేశారు. ఈ ఫోన్ కెమెరాల చుట్టూ కూడా కోకాకోలా థీమ్‌ని గుర్తు చేసేలా రెడ్ కలర్ రింగ్స్ వేశారు. ఎటు చూసినా కోకా కోలానే గుర్తు చేస్తుంది ఈ స్పెషల్ ఎడిషన్. స్క్రీన్, యాప్స్ అన్నీ అదే థీమ్‌తో ఉంటాయి. ఫిబ్రవరి 14 నుంచి ఈ ఫోన్ సేల్ ఫ్లిప్ కార్ట్ లో లైవ్ లోకి వస్తుంది.

 

Exit mobile version
Skip to toolbar