Prime9

CM Chandrababu: నేడు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం

Andhra Pradesh: ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ఆమోదం తెలుపనుంది. అలాగే తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీ సభ విజయవంతం, దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన  30కి పైగా అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. కార్మిక, కర్మాగారాల శాఖకు సంబంధించి 2019లో..గత ప్రభుత్వం ఆమోదించి కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న..మూడు బిల్లులను వెనక్కి తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మత్స్యకారులకు నిషేధ సమయంలో ఇచ్చే 10 వేలను 20 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మెగా ఈవెంట్స్.. నిర్వహించేందుకు ఆమోదం తెలపనుంది.

 

దేశ సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి..ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు..ఈ నేపథ్యంలో వైమానిక దాడులకు సంబంధించి ఏపీలో కూడా ప్రజల్ని అప్రమత్తం చెయ్యాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది..కేంద్రం ఇప్పటికే వైజాగ్ లో మాక్ డ్రిల్ నిర్వహించింది. సీఎం చంద్రబాబు కూడా తీర ప్రాంత భద్రత ..రక్షణ శాఖకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు

 

ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలకు ఉపశమనం కలిగించిందని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు..దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ప్రశంసనీయమని ఆయన తెలిపారు. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ వల్ల ప్రజల్లో భద్రతాభావం పెరిగిందని, ఇది దేశ సమగ్రతకు బలమైన సంకేతమనిఅన్నారు..

Exit mobile version
Skip to toolbar