Prime9

5 missing in Godavari River: గోదావరిలో 8 మంది గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం

3 Died 5 people missing in Godavari River: ఏపీలో తీవ్ర విషాద ఘటన జరిగింది. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వద్ద నిన్న సాయంత్రం గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమచారంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున ముగ్గురు యువకుల మృతదేహాలు లభించాయి. దీంతో మిగిలిన ఐదుగురి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా సహాయక చర్యల కోసం అధికారులు ఘటనాస్థలి నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు.

 

కాగా కాకినాడ, రామచంద్రాపురం, మండపేటకు చెందిన యువకులు స్నేహితుడి పెళ్లికోసం వచ్చారు. వివాహం అనంతరం గోదావరిలో స్నానం చేసేందుకు 12 మంది నీటిలోకి దిగారు. వారిలో 8 మంది నీటిలో మునిగిపోయారు. మిగిలిన నలుగురు యువకుల సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. గల్లంతైన వారిని క్రాంతి, పాల్, సాయి, మహేష్, సతీష్, రాజేష్, రోహిత్ గా గుర్తించారు. కాగా యువకులు గల్లంతు అవడంతో వారి ఇళ్లల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Exit mobile version
Skip to toolbar