Prime9

AP TDP Government: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి

TDP Government One Year Anniversary: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికీ ఏడాది పూర్తియింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జేఎస్‌పీ, బీజేపీ కలిసి పోటీ చేశారు. వైసీపీపై వ్యతిరేకత, కొత్త ప్రభుత్వంపై ఆశలతో ప్రజలు కూటమికి 164 సీట్లతో అధికారం కట్టబెట్టారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, సత్యకుమార్ మంత్రిగా మూడు పార్టీల అగ్రనేతలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

 

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత పెన్షన్ల పెంపు, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. అలాగే దీపం 2 పథకం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. అంతేకాకుండా నేటి నుంచి తల్లికి వందనం, ఈనెల 21న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రారంభించనుంది.

 

Exit mobile version
Skip to toolbar