Pawan Kalyan Birth day Wishes to Bala Krishna: టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ హీరోలతో పాటు రాజకీయ నాయకులు విషెస్ చెబుతున్నారు. ఇందులో భాగంగా కొంతమంది ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్పెషల్ విషెస్ చేశారు.
‘వెండి తెర కథానాయకుడిగా కోట్లాది అభిమానులను పొందిన బాలకృష్ణ.. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్దిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. సినిమాల్లో హిస్టరీ, జానపద, పౌరాణిక వంటి పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. హిందూపురం డెవలప్‌మెంట్ కోసం చేసిన కృషి ఎనలేనిదన్నారు. సంతోషంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు.