Prime9

Thalliki Vandanam: జగన్ కడుపు మంట మూడింతలు పెరిగింది

Thalliki Vandanam: తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయింది.. తెలుగా ఆడపడుచుల కళ్లలో ఆనందం చూసి మాజీ సీఎం జగన్ కడుపు మంట మూడింతలు పెరిగిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తల్లుల పేరుతో లీలలు వంధనం వింతలు అని మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని లోకేష్ మండిపడ్డారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని లోకేష్ స్పష్టం చేశారు. గ్రామ సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయన్నారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారని అనుకుంటే ఎలా అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.

 

 

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేయడం పట్ల కృష్ణాజిల్లా గుడివాడలో జనసేన పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జనసేన నేత సందు పవన్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు సీతాల సుభాషిణి, గుళ్లపల్లి రమాదేవి , కొప్పినేని శేషవేణి, వంగలపూడి రాము మోగసాల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Exit mobile version
Skip to toolbar