Prime9

Perni Nani on Vamsi’s Health: వంశీ ఆరోగ్య పరిస్థితిపై కూటమి సర్కారుకు కనీసం మానవత్వం లేదు.. మాజీ పేర్ని నాని!

Former Minister Perni Nani visited Vallabhaneni Vamsi: అది మహానాడు కాదని, దగా నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌తో కలిసి పరామర్శించారు, అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కూటమి సర్కారుకు కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

 

బలి తీసుకోవడానికి కుట్ర..

వల్లభనేని వంశీని బలి తీసుకోవడానికి కూటమి సర్కారు కుట్ర చేస్తోందన్నారు. మాజీ మంత్రి అచ్చెన్నను అరెస్టు చేస్తే పైల్స్ అంటూ డ్రామాలు ఆడారని, ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కాపాడుకున్నారని గుర్తుచేశారు. వంశీకి ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఉన్నా చికిత్స అందించడం లేదని ఆరోపించారు. చెంచాగిరి చేస్తున్న ఉద్యోగులను అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. సీఐ భాస్కర్‌రావు, ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎవరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

 

న్యాయ పోరాటం చేస్తాం : ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌

అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వంశీ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్రమ కేసుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, వంశీని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version
Skip to toolbar