Prime9

AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు

AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కాం సొమ్మును రియల్ ఎస్టేట్‌లోకి మళ్లించారు. మూడేళ్లలో మూడు వేల కోట్లకు ఆదాయం చేరుకుంది. జగన్ కుటుంబానికి చెందిన సన్నిహిత వ్యక్తి కధ నడిపించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోవిందప్ప బాలాజీ విచారణలో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై కేంద్రంగా అనేక షెల్ కంపెనీలు నడిపించినట్లు సమాచారం.

 

ముంబైలోని ఎంజె మార్కెట్‌లోని ఎనిమిది కంపెనీలకు లిక్కర్ స్కాం ముడుపులు అందగా.. బంగారు ఆభరణాల దుకాణాలకు డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది. దీనిపై సిట్ కూపీ లాగుతుంది. మనీ లాండరింగ్‌కు సంబంధించి సాక్ష్యాలు ఈడీ సేకరిస్తుంది. అయితే వీటిపై అనుమానం రాకుండా నాటి ప్రభుత్వ పెద్దలు పని కానిచ్చేశారు. ఈ కేసులో 33వ నిందితుడిగా ఉన్నారు గోవిందప్ప బాలాజీ. మంగళవారం కర్ణాటకలో అరెస్ట్ చేయగా బుధవారం విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈనెల 20వరకు రిమాండ్ విధించింది కోర్టు.

 

లిక్కర్ కుంభకోణంలో గోవిందప్ప బాలాజీ కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ కంపెనీల దగ్గరనుంచి వసూళ్లు , రూటింగ్ చేయడం వరకు ప్రతీ దశలో బాలాజీది కీలకపాత్ర. ముడుపుల వ్యవహారం, నగదు మళ్లంపు తదితర అంశాలపై పోలీసులు బాలాజీని విచారిస్తున్నారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు తనకు సంబంధం లేదని బుకాయిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar