Prime9

Chandragiri : చంద్రగిరిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

Chandragiri : తిరుపతి జిల్లా చంద్రగిరిలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కార్యకర్తలు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇన్‌చార్జి దేవర మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నాగాలమ్మ దేవాలయం నుంచి కొత్త కార్యాలయం వరకు కొనసాగింది. కార్యకర్తలు, స్థానిక జనసేన అనుచరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు. జనసేన దేశంలోనే 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీగా నిలిచిందని చెప్పారు. కుల, మత, వర్గ విభేదాలను వదిలిపెట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన ముందుకు సాగాలని, పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచి గెలుపుకోసం కృషి చేయాలన్నారు. జనసేన సిద్ధాంతాలు, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యకర్తలు సమష్టి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

Exit mobile version
Skip to toolbar