Prime9

Srilakshmi : ఓఎంసీ కేసు మళ్లీ విచారణ.. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురు

IAS officer Srilakshmi faces charges in Supreme Court : ఓఎంసీకి సంబంధించిన కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మూడు నెలల్లో మరోసారి విచారణ జరుపాలని సుప్రీం ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా మళ్లీ విచారణ చేపట్టాలని పేర్కొంది. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. డిశ్చార్జ్ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీం తోసిపుచ్చింది.

 

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో నిందితులకు మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితులైన గాలి జనార్దన్‌రెడ్డితోపాటు బీవీ.శ్రీనివాసరెడ్డి, వీడీ.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్‌లకు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల శిక్ష, రూ.20వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్‌కు రూ.2లక్షల జరిమానా విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద ఏడేళ్లు శిక్షలు పడ్డాయని, శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైలులో అనుభవించిన శిక్షను మినహాయింపు ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar