Prime9

CM Chandrababu: రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu:  రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు.

 

వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్‌హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద 11వేల, 325 కోట్లతో 770 కిలో మీటర్ల రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర కార్యాలయాలను సీఎం చంద్రబాబు వర్ఛువల్‌గా ప్రారంభించారు. విజన్‌-2047 లక్ష్యంగా కూటమిప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న సీఎం చంద్రబాబు.. ఆ దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ఐటీతో పాటు AI, క్వాంటం టెక్నాలజీలకు ప్రాధాన్యత నిస్తూ.. అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు. అలాగే సమాంతరంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Exit mobile version
Skip to toolbar