Prime9

AP Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం అప్డేట్.. ఇలా చేస్తే నేరుగా ఖాతాల్లోకి రూ.15వేలు

Documents for Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ నెలలోనే ఈ పథకం ప్రారంభిస్తున్నందున డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి సంబంధించి బ్యాంక్, ఆధార్ నంబర్లను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.

 

పథకం ప్రారంభ తేదీ: జూన్ 12, 2025.

లబ్ధిదారులు: 1వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు.

ఆర్థిక సహాయం: ప్రతీ ఏడాది 15వేలు. తల్లులకు ఆర్థిక సహాయం, పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు.

 

అర్హతలు:

 

 

పథకానికి కావాల్సిన పత్రాలు:

 

విద్యార్థుల తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15వేలు జమ కానున్నాయి. ఈ పథకం కింద డబ్బులు త్వరగా పడేందుకు విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్‌తో పాటు ఎన్‌పీసీఐను జూన్ 5 లోగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లింక్ చేయని యెడల లింక్ చేసుకునేందుకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

 

Exit mobile version
Skip to toolbar