Prime9

Ration Policy: రేషన్ బదులు నగదు.. ఏపీ సర్కార్ ఏర్పాట్లు

AP Government: రాష్ట్రంలో రేషన్ బదులుగా నగదు ఇచ్చే అంశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న రేషన్ విధానాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 1 నుంచి షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోందని టాక్. రేషన్ లబ్ధిదారులు ఎవరైనా సరుకులు వద్దనుకుంటే వారికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన చేస్తోందట. ఈ దిశగా రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పు చేసేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకవేళ బియ్యం వద్దనుకుంటే.. బియ్యానికి సరపడా నిత్యవసర సరుకులు అందించే ప్రతిపాదనను కూడా ఆలోచించిందట. ఈ నేపథ్యంలోనే మే 31న కోనసీమ జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు రేషన్ బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న రేషన్ విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందట. ఒకవేళ రేషన్ బదులు నగదు ఇస్తే కేంద్ర ప్రభుత్వం అందించే సహకారంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. అయితే బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ బదులు నగదు ఇవ్వడం మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత రానుంది.

Exit mobile version
Skip to toolbar