Prime9

Vizianagaram : విజయనగరంలో తీవ్ర విషాదం.. కారులో ఊపిరి ఆడక నలుగురు చిన్నారుల మృతి

Vizianagaram : విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసింది. కారు డోర్‌కు లాక్ పడటంతో అందులో చిక్కుకున్న నలుగురు చిన్నారులు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులు ఎంత వెతికినా వారు కనిపించలేదు. చివరకు స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారుల మృతదేహాలు ఉన్నట్లు వారు గుర్తించారు.

 

సరదాగా ఆడుకునేందుకు కారు లోపలికి వెళ్లిన తర్వాత లాక్ పడటంతో ఊపిరి ఆడక మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతులను ఉదయ్(8), చారుమతి (8), చరిష్మా (6), మనస్విగా గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు. చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

Exit mobile version
Skip to toolbar