Banana cultivation: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ భూమిని అనుసరించి రైతులు విభిన్న పంటలను పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. లాభదాయకమైన పంటలతో పాటు.. సులభతరమైన పంటల సాగువైపు మెుగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అరటి సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అరటి సాగు చేయాలనుకునే రైతులు.. సాగులో మంచి పద్ధతులు పాటిస్తే అధిక లాభాలను పొందవచ్చు. సాగుపై అవగాహన.. రసాయనాల వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకుంటే ఇందులో మంచి లాభాలను ఆర్జించవచ్చు. అలాగే అరటిసాగుకు అనువైన నేలలు.. సాగునీటి వసతులను కల్పించాలి.
మంచి నాణ్యమైన అరటి పండ్లను పొందటానికి పంట నిర్వహణ చాలా ముఖ్యమైనది. వేసవిలో నీటిని దృష్టిలో ఉంచుకుని సరైన నిర్వహణ పద్ధతులు చేపట్టడం చాలా అవసరం.
బిందు సేద్యం పద్ధతిలో మొక్కలకు తగినంత నీరు అందుతుంది.
గెల వేసే సమయంలో నెలకు ఒక మొక్కకు 25 కిలోల ఆవు పేడ, 100 గ్రాముల పొటాష్, 200 గ్రాముల యూరియా వంటి ఎరువులను ఇవ్వాలి.
అరటిలో రకాలు.. (Banana cultivation)
కర్పూర చక్కెర కేలి
తెల్ల చెక్కెర కేళి
అమృత పాణి
వామన కేళి
అరటిని నిరంతరాయంగా పండించడం, అధిక ఉష్ణోగ్రత, నీటి పారుదల లేని, తేలికపాటి నేలలు, అధిక తేమ శాతం పనామా వ్యాధి వ్యాప్తికి దోహదం చేస్తాయి.
మట్టి ద్వారా సంక్రమించే ఈ వ్యాధి వేర్ల ద్వారా మొక్కలోకి ప్రవేశిస్తుంది. నీటి పారుదల సక్రమంగా లేని నేలల్లో ఎక్కువగా సంభవిస్తుంది.
ఇది సోకిన తొలి దశలో ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతాయి. వ్యాధి సోకిన మొక్క కాండం ఎర్రటి చారలు కలిగి ఉంటుంది.
ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమైన మొక్కలను వేరుచేసి కాల్చేయాలి. ఒకవేళ ఈ వ్యాధి తాకిడి తీవ్రంగా ఉంటే కనీసం 3-4 ఏండ్ల పాటు అరటిని సాగు చేయకుండా చూసుకోవాలి.
పనామా తెగులుని తట్టుకొనే రకాలను ఎంచుకోవడం ఉత్తమం. అరటి మొక్క పునాది దగ్గర సున్నం నీటిని చల్లడం ద్వారా వ్యాధి సోకకుండా నివారించవచ్చు.
అరటి సాగు తర్వాత అదే పొలంలో పొద్దుతిరుగుడు లేదా చెరకును సాగు చేయకుండా చూడాలి.