Site icon Prime9

Viral Video: ఈ కుక్క పిల్ల చేసిన సాయం చూస్తే మీరు కూడా షాక్ అవ్వాలిసిందే!

small dog prime9news

small dog prime9news

Viral  Video : చాలా మంది ఇళ్లల్లో చిన్న చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. నిజానికి పెంపుడు జంతువులు మంచి స్నేహితులుగా మారిపోతాయి. పైగా చాలా మంది పెంపుడు జంతువులకి చిన్న దెబ్బ తగిలిన అస్సలు తట్టుకోలేరు. ఎంతో జాగ్రత్తగా అల్లారు ముద్దుగా సొంత పిల్లల్ని పెంచుకున్నట్టే పెంపుడు జంతువులను కూడా పెంచుకుంటారు. పైగా అవి ఇంట్లో మన ముందు సంతోషంగా తిరుగుతూ ఉంటాయి. వాటితో మంచిగా సమయం గడిచిపోతుంది. కొంచెం కూడా బోర్ కొట్టదు. నిజానికి కుక్కలు మనిషికి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు.

వీడియోలో ఏముందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
వీడియోలో కుక్కపిల్ల ఎంత క్యూట్‌గా ఉందో, నిజానికి ఇది క్యూట్‌గా మాత్రమే కాదు, మంచి మనసుని కూడా కలిగి ఉంది. ఈ వీడియోలో ఒక ముసలావిడ కూర్చోవాలని ప్రయత్నిస్తూ ఉంది. ఈ కుక్కపిల్ల స్టూల్‌ని ఆమెకి అందేలా జరుపుతూ ఉంది. ఆ తర్వాత ఆమె చిన్నగా స్టూల్ మీద కూర్చుంది. ఇలా ఆమె కూర్చోడానికి ఈ చిన్న కుక్క పిల్ల స్టూల్‌ని జరిపి ఎంత పెద్ద సాయం చేసిందో కదా. మీరు కూడా ఈ వీడియోని చూడండి. ఆ కుక్క పిల్లకు ఆ తెలివి తేటలు ఎలా వచ్చాయన్నది నెటిజన్లను షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారు కుక్క పిల్ల చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. దాని మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు.

Exit mobile version