Site icon Prime9

Viral Video : ఈ అమ్మాయి ఎంత మంచి పని చేసిందో ఈ వీడియోలో చూడండి !

elephant 33 prime9news

elephant 33 prime9news

Viral Video : ఏనుగులు గురించి మనకి తెలియని విషయం ఏంటంటే అవి చాలా తెలివైన జంతువులు.అవి ఎమోషన్స్‌ని బాగా అర్థం చేసుకోగలవు. అవి సాధారణంగా అవి మనుషుల జోలికి రావు..వాటి జోలికి మనుషులు వెళ్తే తప్ప.ఏనుగులు చాలా అరుదుగా మనుషులపై ఎటాక్ చేస్తాయి.అందుకే చాలా మంది ఏనుగులను ఇష్టపడుతూ ఉంటారు.

Viral Video :అసలు ఈ వీడియోలో ఏముందంటే గమనిస్తే..ఒక ఏనుగు చెరుకు పొలానికి, రోడ్డుకీ మధ్య బురదలో ఏనుగు కాళ్లు చిక్కుకుపోయాయి.అది చూసిన ఓ అమ్మాయి ఏనుగు దగ్గరికి వెళ్లి ఏనుగు కాళ్ళని బయటకు తీసేందుకు ప్రయత్నించింది.కానీ ఆమెకు అంత బలం లేదు కానీ ఆ ఏనుగు తిరిగి దాడి చేస్తుందేమో అనే భయం ఉన్నా ఆ అమ్మాయి మంచి మనసుతో ప్రాణాలకు తెగించింది. చుట్టు పక్కల వాళ్ళు తాలూకు వాళ్లు….జాగ్రత్త అని చెబుతున్నా….ఆమె ఏ మాత్రం తగ్గకుండా ఏనుగుకు సహయం చేసింది.తన కోసం ఆమె పడుతున్న శ్రమను ఏనుగు గమనించింది.ఆ ఏనుగు కూడా బురద నుంచి బయటకు వచ్చేందుకు బాగా ప్రయత్నించింది. ఇలా రెండు వైపులా చేసినా ప్రయత్నం చివరకు ఫలించింది.వెంటనే ఆ ఏనుగు ఆమెకి థాంక్స్ చెబుతున్నట్లుగా…తొండంతో ఆ అమ్మాయిని ఆశీర్వదించింది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Exit mobile version