Site icon Prime9

viral Video : బుల్లి పెంగ్విన్ పక్షికి నీటిని అందించిన ఓ వ్యక్తి ..వైరల్ అవుతున్న ఈ వీడియో పై ఓ లుక్ వేయండి !

viral video prime9news

viral video prime9news

viral Video : కొన్ని సార్లు మనం పక్షులను గానీ, జంతువులని గానీ చూస్తే.. చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాము.మనలో చాలా మంది పక్షులనూ, జంతువులనూ ఎంతగానో ఇష్ట పడుతుంటారు.పావురాలు,ఇతర పక్షులకు ఆహారాన్ని ఇవ్వడం, జంతువులకు తినుబండారాలు ఇవ్వడం వంటివి చేస్తూ ఉంటారు.కొంతమంది ఐతే రోడ్డు మీద తిరిగే కుక్కల వంటి వాటిని ఇంటికి తెచ్చి పెంచుకుంటారు.అలానే మేడ మీద పక్షుల కోసం నీళ్లు పెట్టడం, ధాన్యం వంటివి వేయడం లాంటివి చేస్తుంటారు. నిజానికి ఇది చాలా ఎంతో మంచి పని. పక్షులకి ఆహరం వేస్తే వాటి ఆకలి తీరుతుంది. మనకి కూడా చాలా పుణ్యం వస్తుంది.ఇలా చాలా మంది పక్షుల పైన జంతువుల పైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. నిజానికి జంతువుల పైన పక్షుల పైన ప్రేమ చూపించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి అన్నీ ఉన్నాయి కానీ వాటికి మాత్రం ఏవి లేవు.కాబట్టి వాటికి కూడా ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది.

ఆ వీడియోలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం
పక్షి పట్ల చూపించిన దయకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఓ పిల్ల పెంగ్విన్ దాహంతో బాగా అల్లాడుతోంది. అది గమనించిన ఓ మనిషి తన దగ్గరున్న వాటర్ బాటిల్‌తో ఆ బుల్లి పెంగ్విన్ పక్షికి నీటిని అందించాడు. సరిగ్గా నిలబడటం కూడా రాని ఆ పిల్ల పెంగ్విన్..కొంచం కొంచం నీరు తాగుతూ.. దాహన్ని తీర్చుకుంది. ఇందులో ఆ మనిషి ఎవరన్నది తెలియలేదు. కానీ ఆ మనిషి చేసిన సాయం నెటిజన్లకు బాగా నచ్చింది.ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

Exit mobile version