Site icon Prime9

Love Viral Video : ఈ అబ్బాయి లవ్ ప్రపోజల్ చూస్తే ఏ అమ్మాయి ఐనా పడిపోవాలిసిందే ! మీరే చూడండి !

love propasal prime9news

love propasal prime9news

Love Viral Video:  ప్రేమను వ్యక్త పరచడం అంతా సులభం కాదు.ప్రేమించడానికి ధైర్యంతో పని లేదు కానీ.. ప్రేమను వారికి చెప్పడానికి చాలా ధైర్యం కావాలి.అలాగే వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని వేయి కళ్ళతో వేచి చూస్తా ఉంటాము.కొందరు ప్రేమ ఉన్నా ప్రేమని దాచేస్తూ వుంటారు. కొంత మంది సందర్భం చూసి వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు. పైగా ప్రపోజ్ చేయడానికి చాలా మంది చాలా రకాల పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. ఒక కవిత రాసి ప్రపోజ్ చేయడం, లేదంటే గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయడం, ప్రేమలేఖతో ప్రపోజ్ చేయడం ఇలా ఎవరికి నచ్చిన దారులు వారు సెలెక్ట్ చేసుకొని ప్రపోజ్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో కూడా వివిధ రకాలుగా ప్రపోజ్ చేస్తూ ఉంటారు.వాటిని చూసి నిజ జీవితంలో చాలా మంది అలానే ఫాలో అవుతూ ఉంటారు.ప్రపోజ్ చేసే స్టైల్‌ని బట్టీ ఎదుటి వాళ్ళని బుట్టలో పడేయ్యాలని చాలా మంది భావిస్తారు కానీ మనసులో ప్రేమ ఉంటే కానీ yes చెప్పరు కదా..?ఐతే సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది.ఈ వ్యక్తి ఏకంగా సినిమాటిక్ రేంజ్‌లో తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు.

తన ప్రియురాళికి ఏకంగా బాలీవుడ్ రేంజ్‌లో ఇతగాడు ప్రపోజ్ చేశాడు.ప్యారిస్‌లో ఈ వ్యక్తి మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు.ఈఫిల్ టవర్ దగ్గర్లో తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు.వావ్ ఫ్యాక్టరీ ప్యారిస్ అనే పేజ్‌లో దీన్ని షేర్ చేయడం జరిగింది.పైగా అక్కడ ఒక అందమైన సెటప్‌ని ఏర్పాటు చేసి “మ్యారీ మీ” అని పూలతో చాలా అందంగా నేల మీద రాసి గులాబీ రేకులు, కొవ్వొత్తులు ఇలా ఒక రొమాంటిక్‌గా సెటప్ చేసి, షారుక్ ఖాన్ పాట కోయీ మిల్ గయాకి పాటకు డాన్స్ వేసుకుంటూ ప్రపోజ్ చేశాడు.సోషల్ మీడియాలో ఈ వీడియో ఎందరి మనసులను దోచుకున్నదో మీరే చూడండి.

Exit mobile version
Skip to toolbar