Site icon Prime9

Viral Video: దేవుడు గుడిలో ఈ మేక ఎంత పని చేసిందో చూడండి!

goat prime9news

goat prime9news

Goat Viral Video : పండుగలు వచ్చినప్పుడు గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం. అలాగే అభిషేకాల్లో కూడా పాల్గొంటాం. మన కోరికలు దేవుడుకు చెప్పుకొని మొక్కులు చెల్లించుకుంటాం. పూజా కార్యక్రమాలు అయ్యే వరకూ గుడిలోనే ఉండి, తరవాత హారతి కళ్లకు అద్దుకొని, ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్లిపోతాం. సహజంగా గుడికి మనుషులు మాత్రమే వెళుతుంటారు. కానీ ఇది మాత్రం అద్భుతం అని చెప్పాలి. ఒక మేక గుడిలోకి వచ్చి ఏదో జంతువు వచ్చినట్లు కాకుండా మనిషి గుడి లోపలికి వెళ్లేటప్పుడు ఏ పద్దతులు పాటిస్తాడో అలాగే ఈ మేక కూడా అలాగే చేసింది.

ఆ మేకను చూసి అందరూ షాక్ అవుతున్నారు. గుడిలోని మెట్ల పై ఆ మేక మోకాళ్ళ మీద నిల్చుని, పూజారి హారతి ఇస్తున్నప్పుడు ఆ మేక మోకాళ్ళతో వంగి నమస్కారం చేసింది. ఆ మేకను చూస్తుంటే ఎంత శ్రద్దగా ప్రార్థన చేస్తుందో మీరు కూడా చూడండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భక్తులే కాదు సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.

Exit mobile version