Site icon Prime9

Viral Video: ఈ పానీపూరీ రూటే సపరేటు.. గోలగప్ప ఫౌంటెన్..!

panipuri fountain viral video

panipuri fountain viral video

Viral Video: పానీపూరి ఈ ఆహారపదార్ధం తెలియని వారుండరు. ప్రస్తుత కాలంలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పానీపూరిని సాధారణంగా ఏ బండిపైనో లేదా ఏ రోడ్ పక్కన ఉన్న షాప్లోనో తింటూ ఉంటాం. కానీ మీరెప్పుడైనా ఫౌంటెన్‌ పానీపూరిని తిన్నారా. అసలు ఫౌంటేన్ పానీపూరి గురించి విన్నారా.. మరి ఇది ఎలా ఉంటుంది అనే ఆసక్తి మీలో ఉంది కాదా అయితే ఈ కథనం చదివెయ్యండి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ పానీపూరీ వీడియోపై ఓ లుక్కెయ్యండి.

ఈ దేశీయ స్నాక్‌కు అనేక రకాల పేర్లున్నాయి. ఓ దగ్గర పానీపూరీ అని మరో దగ్గర పుచ్కా అని ఇంకో దగ్గర గోల్ గప్ప అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. పేరు ఏదైనా టేస్ట్ మాత్రం సూపర్ అని తింటూ ఉంటారు ఫుడ్ లవర్స్. అయితే ప్రస్తుతం నెట్టింట ఫౌంటెన్ పానీ పూరీ తెగ హల్చల్ చేస్తుంది. టిక్‌టాక్‌లో షేర్‌ అయిన ఈ ఒరిజినల్‌ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ పద్మాలక్ష్మి తన ట్విట్టర్‌లో షేర్ చేయగా తాజాగా ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో పానీని పౌంటెన్‌ నుంచి జనం తమ పూరీల్లోకి నింపుతుండటం కనిపిస్తుంది. మీరు గోల్‌గప్ప లవర్‌ అయితే పద్మా లక్ష్మి లాగా మీరు కూడా ఈ ఫౌంటెన్‌ పానిపూరిని కోరుకుంటారు. ఇది కోరిక కాదు అవసరం అని పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు పద్మాలక్ష్మి. ఇకపోతే ఈ వీడియోకు ఫిదా అయిన నెటిజన్లు పానీపూరి ఫౌంటెన్‌ను తెగ మెచ్చుకుంటూ కామెంట్లు రాస్తున్నారు.

ఇదీ చదవండి: అరుదైన దృశ్యం… కళ్లు మూస్తూ తెరుస్తూ ఉన్న హనుమంతుని విగ్రహం..!

Exit mobile version