Site icon Prime9

Rajasthan Poll Date: నవంబర్ 23 నుంచి 25 కు మారిన రాజస్థాన్ ఎన్నికల తేదీ

Rajasthan Poll Date

Rajasthan Poll Date

 Rajasthan Poll Date: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సవరించింది ఎన్నికల కమిషన్‌. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న జరగాల్సిన ఎన్నికలు తేదీని సవరించినట్టు భారత ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ప్రకటించింది. నవంబర్ 25న ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ను సవరణ చేసినట్టు పేర్కొంది.

పెద్ద ఎత్తున పెళ్లిళ్లు ఉండటం వల్లే..( Rajasthan Poll Date)

నవంబర్ 23న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నందున ఎన్నికల తేదీని సవరించినట్టు ట్వీట్ చేసింది. వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల నుంచి విజ్ఞప్తులు అందాయి. వివిధ మీడియా సంస్థలు లేవనెత్తిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. పోలింగ్ తేదీన పెద్దఎత్తున పెళ్లిళ్లు, సామాజిక కార్యక్రమాలు ఉన్నందున ఓటర్లు పార్టిషిషన్ తగ్గే అవకాశం ఉండటంతో ఎన్నికల తేదీని సవరించాలని నిర్ణయించాం” అని ఎన్నికల కమిషన్ ప్రకటనలో వివరించింది.

రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించి ఈసీఐ సవరించిన షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 30న గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. నవంబర్ 6వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. నవంబర్ 7వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 9వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. నవంబర్ 25న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.
తొలుత ఈసీ ప్రకటించిన నవంబర్ 23వ తేదీన కార్తీక శుద్ధ ఏకాదశి కావడం, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు జరుపుకునే రోజు కావడం, అదేరోజు 45వేలకు పైగా పెళ్లిళ్లు రాష్ట్రంలో జరుగనుండటంతో పోలింగ్ శాతంపై వీటి ప్రభావం పడుతుందని బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లాయి. తేదీని సవరించాల్సిందిగా విజ్ఞప్తులు చేశాయి.

Exit mobile version