Hero Navdeep: మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పరారీలో ఉన్నాడని హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో నవదీప్ ఉన్నారని అన్నారు. నవదీప్ స్నేహితుడు రాంచందర్ ను అదుపులోకి తీసుకున్నామని అతని ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేసామని చెప్పారు.
బేబీ సినిమాపై కమీషనర్ ఫైర్..(Hero Navdeep)
మరోవైపు బేబీ సినిమా డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహించేలా కమీషనర్ ఆనంద్ మండిపడ్డారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దాడి చేసినప్పుడు..అక్కడ సన్నివేశాలు బేబీ మూవీని తలపించాయి. అందులో మాదిరిగానే నిందితులు పార్టీ చేసుకున్నారు. సినిమాలో ఆ సీన్ వచ్చినపుడు కనీసం హెచ్చరిక ప్రకటన కూడా వేయలేదు. బేబీ చిత్ర నిర్మాతకు నోటీసులు ఇస్తాము. ఇకపై అన్ని సినిమాలపై ఫోకస్ పెడతామని అభ్యంతరకర సన్నివేశాలుఉంటే ఊరుకునేది లేదని అన్నారు.