Garbage Tax: ఏపీ ప్రజలకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పట్టణాలు, నగరపాలక సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే.. కొత్త ప్రభుత్వం రద్దు చేస్తూ,.. నిర్ణయం తీసుకుంది.
చెత్తపన్ను ద్వారా రూ.200 కోట్లు..(Garbage Tax)
చెత్త పన్ను పేరుతో పేదల నుంచి గత ప్రభుత్వం నెలకు 30 రూపాయల నుంచి.. 150 రూపాయల వరకు వసూలు చేశారు. తద్వారా గత ప్రభుత్వం సుమారు 200 కోట్లు వసూలు చేసింది. 2001 నుంచి రాష్ట్రంలో చెత్త పన్నును వేస్తూ. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెత్త పన్నును ప్రభుత్వం ప్రారంభించిన దగ్గరి నుంచి ప్రజలలో చెత్త పన్నుపై వ్యతిరేకత మొదలయింది. దీనితో ఇటీవల జరిగిన అసంబ్లీ ఎన్నికలకు రెండు నెలలముందు వసూళ్లు ఆపివేసినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదీరకముందే చెత్త పన్ను రద్దు చేస్తు ఆదేశాలు జారీ కావడం విశేషం.