Bridge Collapses in Bihar:మన దేశంలో కాంట్రాక్టర్లు నాసిరకం బ్రిడ్జిలు నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సర్వసాధారణం. బిహార్‌లోని ఆరియా అనే ఏరియాలో నాలుగు రోజుల క్రితం ఓ బ్రిడ్జి కూలింది. ఈ ఘటన మరిచిపోక ముందే శనివారం నాడు శివాన్‌లో మరోమరో బ్రిడ్జి కూలింది. కాగా శివాన్ ప్రభుత్వ అధికారుల సమాచారం ప్రకారం ఇటుకలతో కట్టిన గోడలతో పాటు బ్రిడ్జికి కనెక్ట్ అయ్యే పిల్లర్లు బలహీనం కావడంతో కావడంతో బ్రిడ్జి కూలింది. దీనిపై విచారణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
నాలుగు రోజుల క్రితం అరారియా ప్రాంతంలో బ్రిడ్జి కూలింది. అటుతర్వాత డారౌండ్ ఏరియాలో మరో బ్రిడ్జి కూలింది. కాగా శనివారం నాడు శివాన్‌లో ఈ బ్రిడ్జి కూలింది. గత రెండు సంవత్సరాల నుంచి చూస్తే రాష్ర్టంలో ఐదు బ్రిడ్జిలు కుప్పకూలాయి. అధికారుల సమాచారం శివాన్‌లో 30 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జి నిర్మించారు. డారౌండ బ్లాక్‌లోని రామ్‌గర్హా పంచాయతీలో కాలువపై నుంచి వెళుతున్న బ్రిడ్జి ఒక వైపు కూలిందని అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 18వ తేదీన ఆరియాలోని సిక్టి అనే ప్రాంతంలో 182 మీటర్ల బ్రిడ్జిలో కొంత భాగం కూలింది. కాగా ఈ బ్రిడ్జని రూ.12 కోట్లతో కేంద్రప్రభుత్వం స్కీంతో నిర్మించడం జరిగింది. కాగా బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకుండానే కూలింది.
ఈ ఏడాది మార్చి 22న సుపౌల్ ఏరియాలో కోసి నదిపై నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జికి సంబంధించిన మూడు శ్లాబ్‌లు కుప్పకూలడంతో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఎనిమిది కార్మికులు గాయపడ్డారు. 10.5 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి రూ.1,200 కోట్ల వ్యయంతో నిర్మించారు. గత ఏడాది 200 మీటర్ల పొడవైన అగౌని – సుల్తాన్ గంజ్ ను కలుపుతూ గంగా నదిపై ఓ బ్రిడ్జిని నిర్మించారు. అయితే దీని సపోర్టింగ్‌గా ఉన్న మూడు పిల్లర్లు కూలిపోయాయి అయితే ఈ ప్రమాదం లో ఎవరూ చనిపోలేదు. 3.1 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జికి రూ.1,710 కోట్ల వ్యయం చేశారు. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్‌లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 2022లో బాగల్‌పూర్‌లోని సుల్తాన్‌గంజ్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి బలమైన ఈదురు గాలులకు కూలిపోయింది. కాగా బ్రిడ్జి కూలిన ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని అధికారులు తెలిపారు.