Viral News : మారుతున్న ఈ ప్రపంచంలో మంచి, మానవత్వం అనేవి.. కేవలం మాటలు కాదు.. ఈ మాటలు కేవలం పదాలగానే మిగిలి ఉన్నాయి అనే అభిప్రాయాన్ని మన చుట్టూ జరిగే కొన్ని ఘటనలు పటాపంచలు చేస్తుంది. ఎక్కడో విదేశాల్లో ఉండే గుర్తు తెలియని వ్యక్తి.. మన దేశంలోని ఓ చిన్న పిల్లాడికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి.. అతడికి చికిత్స కోసం.. ఏకంగా 11 కోట్లు ఆర్ధిక సాయం అందించాడు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. తన పేరు, వివరాలు ఎక్కడా బహిర్గతం చేయకపోవడం. దీంతో సదరు వ్యక్తిని అభినందిస్తూ బాలుడి కి సంబంధించి పోస్ట్ లు పెడుతున్నారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులానికి చెందిన నేవీ ఆఫీసర్ సారంగ్, అతిథిల తనయుడు నిర్వాణ్ వయసు 16 నెలలు. అయితే అతడు పుట్టినప్పుటి నుంచి కాళ్లు కదపడం లేదు. దీంతో ఆందోన చెందిన తల్లిదండ్రులు.. ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చిన్నోడు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 2 అనే డిసీజ్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు.అయితే 2 ఏళ్ల ముందు మందులు వాడితేనే ట్రీట్మెంట్ చేసేందుకు వీలవుతుందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ మెడిసిన్‌ను అమెరికా నుంచి తెప్పించాలంటే.. రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
11 కోట్ల సాయం అందించిన వ్యక్తి (Viral News)..
కాగా ఇప్పుడు ఆ చిన్నారికి 16 నెలల వయస్సు.. అంటే ఇంకో 8 నెలల్లోగా వైద్యం చేయించాలి. కానీ వారికి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. దీంతో ఆ పిల్లాడి వైద్య చికిత్స కోసం దాతలు భారీ ఎత్తున విరాళాలు పంపడం ప్రారంభించారు. ఈ సమయంలోనే ఓ ఫారెనర్ తన నేమ్ చెప్పకుండా 11 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశాడు. ఇంకో 80 లక్షలు సమకూరితే.. చిన్నోడి చికిత్సకు సరిపడా డబ్బులు వస్తాయి. దీంతో చికిత్సకు అవసరమైన మిగిలిన డబ్బుల కోసం ఆ బాలుడి ఫ్యామిలీ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.
నిర్వాణ్ కోలుకున్న తర్వాత తమకు రూ.11 కోట్ల అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందించిన వ్యక్తి గురించి తెలుసుకొని ధన్యవాదాలు చెబుతామని వార కుటుంబ సభ్యులు చెప్పారు. ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి పిడికెడు మట్టిని కూడా మనతో తీసుకుపోలేం అంటారు. నలుగురికి సాయం చేస్తే ఆ సాయం పొందిన వారే మన పేరు చెప్పుకొని కలకాలం హ్యాప్పీగా ఉంటారు. ఆ ఆనందంలోనే మనకు గొప్ప అనుభూతి కలుగుతుందని అంటారు. బహుశా ఈ కోవాకి చెందిన వ్యక్తే ఆ సాయం చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/