Site icon Prime9

Tigers : నల్లమలలో పర్యాటకులకు షాక్ ఇచ్చిన పులులు… వైరల్ గా మారిన వీడియో…

tourist spot two tigers in nallamala forest and video goes viral

tourist spot two tigers in nallamala forest and video goes viral

Tigers :   సాధారణంగా జంతువులలో పులులు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు అయితే చెప్పలేనంతగా ఇష్టపడుతూ ఉంటారు. అదే విధంగా భయం కూడా ఉంటుంది. ఫ్యామిలీతో పాటు సరదాగా బయటికి వెళ్ళి సమయాన్ని గడపాలి అనుకున్నప్పుడు జూ కి వెళ్తూ ఉంటాం. అయితే జూ లో ఉన్న పులి ని చూస్తేనే సాధారణంగా భయం కలుగుతుంది.

అలాంటిది అది నివసించే దట్టమైన అటవీ ప్రాంతంలో మీకు ఓకే సారి రెండు పెద్ద పులులు ఎదురైతే… ఒక్కసారిగా నోట మాట రాదనే చెప్పాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే ఇంక చెప్పాల్సిన పని అవసరం లేదు. ఇలాంటి అనుభవమే ఇటీవల నల్లమల జంగిల్ సఫారీ పర్యాటకులకు ఎదురైంది.

నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ బైర్లూటీ చెంచు గూడెం సమీపంలో నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బైర్లూటీ జంగిల్ క్యాప్ కు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, దేశ విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగింది. బైర్లూటి జంగిల్ సఫారీ కి వచ్చిన పర్యాటకులకు సువిశాల నల్లమల అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు, పక్షులు ఎన్ని కనిపించి కనువిందు చేశాయి.

కానీ ఒక్కసారైనా రియల్ గా రాయల్ గా ఫారెస్ట్ లో తిరిగే పెద్ద పులిని చూడాలని ఆశిస్తుంటారు. అలాంటిది వారికి ఏకంగా ఒకే సారి రెండు పెద్ద పులు తరసపడడం తో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోను పర్యాటకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తో ఇప్పుడా విజువల్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version