Site icon Prime9

వైరల్ వీడియో : నేను మీ పని మనిషిని కాదంటూ ఫైర్ అయిన ఎయిర్ హోస్టెస్..!

small fight between air hostess and passenger video goes viral

small fight between air hostess and passenger video goes viral

Viral Video : ఇటీవల కాలంలో ఎయిర్ హోస్టెస్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వారు డాన్స్ చేసిన వీడియోలు, రీల్స్ చేసినవి ఇలా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కానీ ఈసారి ఓ ఎయిర్ హోస్టెస్ మాత్రం ఓ ప్రయాణికుడితో గొడవపడి వైరల్ అవుతుంది. అయితే ఈ గోడవ ఎయిర్‌ హోస్టెస్‌కు, ప్రయాణికుడికి మధ్య ఆహారం విషయంలో జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో బంధించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ విషయంపై ఇండిగో ఎయిర్‌లైన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, కస్టమర్ సౌలభ్యమే తమ ప్రాధాన్యతగా విమానయాన సంస్థ ప్రకటించింది.

కాగా విమాన ప్రయాణంలో తగదాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. విమానయాన సిబ్బంది ప్రయాణీకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ముఖ్యమైన వ్యక్తులు విమాన ప్రయాణాలు ఎక్కువుగా చేసే అవకాశం ఉండటంతో అక్కడ సిబ్బంది సైతం ప్రయాణీకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కచ్చితంగా ఎయిర్‌పోర్టు అథారిటీ నియమ నిబంధనలు పాటిస్తారు. ఎవరూ ఎవరితో కావాలని గొడవ పడరు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అనుకోకుండా జరిగే ఘటనలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ ఘటన వివరాలలోకి వెళ్తే…

ఇస్తాంబుల్‌-ఢిల్లీ విమానంలో డిసెంబరు 16వ తేదీన ఎయిర్‌ హోస్టెస్‌కు, ప్రయాణికుడికి మధ్య ఆహారం విషయంలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఎయిర్‌ హోస్టెస్‌ సదరు ప్రయాణికుడితో మాట్లాడుతూ… మీవల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారు. మీ బోర్డింగ్‌ పాస్‌లో ఏం ఉందో దాని ప్రకారమే మేము ఆహారాన్ని అందిస్తామని చెప్పింది. అందుకు గాను ఆగ్రహానికి గురైన ప్రయాణికుడు ‘‘నువ్వు ప్రయాణికుడికి సేవకురాలివి’’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఎయిర్‌హోస్టెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘తాను ఉద్యోగిని… నీకు పనిమనిషిని కాను’’ అని గట్టిగా అరిచింది. దీంతో ‘‘ఎందుకు అరుస్తున్నావు? నోర్మూసుకో..’’ అని ప్రయాణికుడు హెచ్చరించగా, ‘‘నువ్వూ నోర్మూసుకో’’ అని ఎయిర్‌హోస్టెస్‌ బదులిచ్చింది. ఆ తర్వాత ఆమె సహోద్యోగి వారిద్దరికి సర్దిచెప్పడంతో గొడవ ఆగింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Exit mobile version