Site icon Prime9

Birthday for a pet dog: పెంపుడు కుక్కకు పుట్టినరోజు.. హాజరయిన 350 మంది అతిథులు

pet dog

pet dog

Jharkhand: జార్ఖండ్‌కు చెందిన ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క పుట్టినరోజును గొప్ప వైభవంగా మరియు ఉల్లాసంగా జరుపుకున్న వీడియో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయబడిన ఈ పుట్టినరోజు వేడుకలో పెంపుడు కుక్క చుట్టూ అనేక మంది అతిథులను ఉండటం చూడవచ్చు.

కుక్కను దాని యజమాని చేతుల్లో పట్టుకొని ఉండగా అతిథులు ప్రేమతో హుమతులు ఇవ్వడం, పుట్టినరోజు దుస్తులను ధరించడం చూడవచ్చు. వేడుకల్లో బర్త్ డే కేక్ కూడా ఉంది, ఈ వీడియో ట్విట్టర్‌లో 2 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. పలువురు నెటిజన్లు దీనిపై స్పందించారు. పెంపుడు తల్లిదండ్రులకు ఇవి తమ సొంత పిల్లలలాంటివి. పెంపుడు జంతువులు లేని వ్యక్తులు అర్థం చేసుకోలేనిది అని ఒక వ్యక్తి రాశాడు. ఈ వీడియో జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందినది. అక్సర్ అనే పెంపుడు కుక్క కోసం గ్రాండ్ బర్త్‌డే పార్టీని ఏర్పాటు చేశారు. అక్సర్ పుట్టినరోజును జరుపుకోవడానికి 350 మందికి పైగా ఆహ్వానించబడ్డారు.సుమిత్ర కుమారి మరియు సందీప్ కుమారి దేశవ్యాప్తంగా ఉన్న వారి బంధువులందరికీ ఆహ్వానాలను అందించారు. అక్సర్‌కు మూడు బంగారు కంకణాలు సహా అనేక బహుమతులు అందించారు. కేక్ కట్ చేసి హారతి కూడా ఇచ్చారు. వీడియోలో అక్సర్ ధరించిన పుట్టినరోజు దుస్తుల ధర రూ.4,500 అని తెలుస్తోంది.

కర్ణాటకలోని తుక్కనట్టి గ్రామంలో పెంపుడు కుక్క కోసం ఇలాంటి పుట్టినరోజు వేడుక జరిగింది. పుట్టినరోజు సందర్బంగా 4,000 మందికి పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుక కోసం 100 కిలోల కేక్‌ను కట్ చేసారు

Exit mobile version