Site icon Prime9

Elephant Viral Video: పార్కులో ఏనుగు భలే ఆడుతుందిగా !

elephant playing in park viral video

Elephant Viral Video: అసోంలోని ఓ పార్క్‌లో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.పార్క్‌లో ఒక ఏనుగు తనంతటతానే ఆడుతోంది.ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అంచంగ్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీ నుంచి ఒక ఏనుగు చిన్న పిల్లల పార్కులోకి వచ్చింది.ఆ ఏనుగు ఎవరినీ ఏమీ అనలేదు.పార్కులో ఎంతో ఆనందంగా ఒక్కతే ఆడుకుంటోంది.పార్కులో ఉండే ఒక వ్యక్తి ఈ వీడియోని రికార్డ్ చేశారు.ఏనుగు పార్కుకి వెళ్లడం..ఆ పార్కులో తను ఒక్కటే ఎంతో ఆనందంగా ఆడడం చాలా బాగుంది. ఈ వీడియో చూసినవారంతా ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.మామూలుగా పార్కులో పిల్లలు ఆడుతూ ఉంటారు కానీ ఒక ఏనుగు ఇలా ఆడటం చూడటానికి విచిత్రంగా అనిపించింది. ఇటువంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి.ఇది చూసిన వాళ్లు ఏనుగు ఆనందాన్ని చూసి మురిసిపోతున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ బ్యూటీఫుల్ వీడియో అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.”ప్రతి జంతువుకీ చాలా ఎమోషన్స్ ఉంటాయి.అవి కూడా చాలా స్వచ్ఛమైన ఎమోషన్స్.ఉంటాయి.మనం ఎప్పుడైనా ఏదైనా జంతువుని బాధ పెడితే…అది చాలా బాధ పడుతుంది” అంటూ ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version