Site icon Prime9

Varanasi: వారణాసి వెడుతున్నారా? అయితే ఇవి తప్పకుండా చూడవలసిందే..

Varanasi: వారణాసి దేశంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. బెనారస్/బనారస్, కాశీ, లేదా వారణాసి గా పిలుచుకునే ఈ నగరానికి సుమారుగా ఐదువేల సంవత్సరాల చరిత్ర వుంది. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా వారణాసికి వెళ్లాలనుకుంటారు. కాశీవిశ్వనాధుడి దర్శనం చేసుకుని గంగానది ఒడ్డున ఆరతిని చూస్తే చాలు జన్మ ధన్యమయినట్లే అని భావించేవారెందరో వున్నారు. ఇటీవల కాశీవిశ్వనాధుడి దేవాలయ ప్రాంగణాన్ని కోట్లాదిరూపాయలతో అభివృద్ది చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారణాసిని దర్శించే యాత్రికులు తప్పకుండా చూడవలసిన అంశాలు వున్నాయి. అవి ఏమిటంటే

1. బోట్ రైడింగ్..
వారణాసిలో గంగానది ఒడ్డున కూర్చొని, మంత్రముగ్ధులను చేసే పడవ సవారీలను ఇష్టపడనివారు వుండరు. పడవ సవారీలు మిమ్మల్ని ఒడ్డున ఉన్న వివిధ ఘాట్‌లకు తీసుకెళ్తాయి, అక్కడ నుండి జరుగుతున్న అద్భుతమైన ఆచారాలను చూడవచ్చు.పడవలో తెల్లవారుజామున నది ఒడ్డున సూర్యోదయాలు మంత్రముగ్దులను చేసే దృశ్యాలను అందిస్తాయి. సంధ్యా సమయంలో జరిగే గ్రాండ్ ఈవెనింగ్ ఆరతిని వీక్షించడానికి యాత్రికులు ఇష్టపడతారు.

2.సాయంత్రం ఆరతి..
వారణాసి గంగానదీతీరంలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. ఘాట్ చుట్టూ పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడివుండగా భారీ ఇత్తడి నూనె దీపాల వెలుగులో పూజారులు మంత్రాలను జపిస్తూ ఇచ్చే ఆ ఆరతి అద్బుతమైన దృశ్యం. ఇది సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగుతుంది.

3.రాంనగర్ కోట..
రామ్‌నగర్ కోట గంగా నది తూర్పు తీరానికి ఎదురుగా ఉన్న కోట. తులసి ఘాట్‌కు ఎదురుగా,ఇది 18వ శతాబ్దంలో కాశీ మహారాజా బల్వంత్ సింగ్ చేత నిర్మించబడిన ఎర్ర ఇసుకరాయి కట్టడం. రామ్-లీలా పండుగ జరుపుకునే అక్టోబర్-నవంబర్ నెలలలో ఇది ప్రత్యేకంగా ప్రకాశిస్తుంది.దాని అద్భుతమైన చరిత్రతో పాటు, సరస్వతీ మ్యూజియం, కత్తులు మరియు తుపాకీలతో కూడిన పాతకాలపు ఆయుధశాల మరియు 19వ శతాబ్దానికి చెందిన గడియారం ఉన్నాయి.

4. సారనాధ్..
బౌద్ధుల అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన సారనాథ్ వారణాసి నగరం నుండి సుమారు 12 కి.మీ దూరంలో ఉంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత మాట్లాడిన ప్రదేశం ఇది. ఇక్కడ అనేక అవశేషాలు మరియు శిధిలాలు ఉన్నాయి.. ధర్మేఖ్ స్థూపం ప్రధానమైన మరియు ఆకట్టుకునే స్థూపాలలో ఒకటి. ఒక పురావస్తు మ్యూజియం, ఆరు దేవాలయాలు ,అశోక స్తంభం ఉన్నాయి. ఇది చూడవలసిన ప్రదేశం.

5.బనారస్ ఫుడ్..
బనారసీ పాన్ లేదా పచ్చి తమలపాకు వారణాసికి ఫేమస్. ఇది తప్పకుండా రుచిచూడవలసిందే. ఇదికాకుండా టొమాటో చాట్, ఆలూ టిక్కీ, కచోరిస్, పానీ పూరీ , బనారసి కలాకండ్, రబ్రీ-జలేబి ఈ పట్టణానికి ప్రత్యేకమైనవి.

6.బనారస్ పట్టుచీరలు..
బనారస్ పట్టుచీరలు ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. ఒక పట్టు చీరను పూర్తి చేయడానికి సుమారు 15 రోజులు లేదా ఒక నెల లేదా 15 రోజులు కొన్నిసార్లు ఆరు నెలలు పడుతుంది. యాత్రికులు వీటిని తప్పకుండా సందర్శించి కొనుగోలు చేస్తుంటారు.

Exit mobile version